ETV Bharat / bharat

'ఆ బాధిత కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం' - ఎన్నికల తర్వాత హింస

బంగాల్​ ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల్లో మరణించినవారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. అలాగే కూచ్​బిహార్​ బాధితుల కుటుంబాలకు హోం గార్డు ఉద్యోగాలు ఇస్తామని వెల్లడించారు.

Mamata, Bengal CM
మమత
author img

By

Published : May 6, 2021, 5:31 PM IST

బంగాల్​లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల్లో 16 మంది చనిపోయినట్లు వెల్లడించారు సీఎం మమతా బెనర్జీ. ఈ మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం చెల్లించనున్నట్లు దీదీ ప్రకటించారు. అలాగే కూచ్​బిహార్​ ఘర్షణలో చనిపోయినవారి కుటుంబాలకు హోం గార్డు ఉద్యోగాలిస్తామని పేర్కొన్నారు. ఈ ఘటనపై సీఐడీ విచారణ ప్రారంభించిందని తెలిపారు.

"ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల్లో 16 మంది చనిపోయారు. వీరిలో ఎక్కువ మంది భాజపా, తృణమూల్​ కాంగ్రెస్​కు చెందినవారే. మరొకరు సంయుక్త మోర్చాకు చెందినవారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం చెల్లిస్తాం. సీతల్​కుచి బాధిత కుటుంబ సభ్యుల్లో ఒకరికి చొప్పున హోంగార్డు ఉద్యోగాలిస్తాం."

- సీఎం మమతా బెనర్జీ

రాష్ట్రంలో.. కేంద్ర ప్రభుత్వ నాయకులే హింసను ప్రేరేపించారని మమత ఆరోపించారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసి.. 24 గంటలు కాక మునుపే కేంద్రం నుంచి ఒత్తిడి మొదలైందని ధ్వజమెత్తారు.

"కేంద్రం నుంచి ఓ లేఖ వచ్చింది. కేంద్ర బృందం కూడా రాష్ట్రానికి చేరుకుంది. భాజపా సామాన్య ప్రజల తీర్పును జీర్ణించుకోలేకపోతోంది. ఈ తీర్పును స్వాగతించాలని కమలనాథులను అభ్యర్థిస్తున్నా" అని వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి: 'యూపీఏ పగ్గాలు మమతకు ఇవ్వాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.