Male goat gives milk: మేకపోతు పాలిస్తున్న అరుదైన ఘటన కర్ణాటకలోని హవేరీ ప్రాంతంలో జరిగింది. హనగల్ తాలూకాలోని నరేగల్ గ్రామానికి చెందిన సాదిక్ మకందార్ కుటుంబం ఓ మేకపోతును పెంచుతోంది. ఒకటిన్నర సంవత్సరం వయస్సు ఉండే ఆ మేకపోతే రోజుకు సుమారు లీటర్ వరకు పాలు ఇస్తూ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
సాదిక్ గతంలో ఓ మేకను కొనుగోలు చేశారు. ఆ మేకకే పాలిస్తున్న ఈ మేకపోతు పుట్టింది. తర్వాత కాలంలో మేక చనిపోగా.. సాదిక్ కుటుంబం మేకపోతును దేవుడికి అంకితం ఇచ్చింది. సుల్తాన్‌గా పేరుపెట్టి జాగ్రత్తగా చూసుకుంది. ప్రతిరోజు పాలు, కూరగాయలు, ఇతర పదార్థాలతో దానిని పోషిస్తూ వచ్చారు. ప్రస్తుతం ఆ మేకపోతే పాలిస్తూ స్థానికులను ఆశ్చర్య పరుస్తోంది.
ఈ తరహా ఘటనలు అరుదుగా జరుగుతుంటాయన్న పశువైద్యాధికారులు.. దీనికి హార్మోన్ల ప్రభావం కారణమంటున్నారు. ఏదేమైనా.. పాలిస్తున్న మేకపోతు.. స్థానికులను విపరీతంగా ఆకర్షిస్తోంది.
కేరళ కన్నూర్ జిల్లాలో ఓ ఆవు దూడ గర్భం దాల్చకుండానే పాలు ఇస్తోంది. కంగోల్కు చెందిన సజేశ్.. 11 నెలల వయసున్న ఈ దూడకు యజమాని. 2021లో ఆవును, దూడను కొనుగోలు చేశాడు. ఆవు పొదుగుకు ఇన్ఫెక్షన్ సోకగా.. దాన్ని అమ్మేశాడు. దూడను మాత్రం తానే పెంచుతున్నాడు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
ఇదీ చదవండి: కుక్క పాలు తాగుతున్న ఆవు దూడ- తల్లిని కాదని...