Maldives India Conflict : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ఒక్క పర్యటనతో లక్షద్వీప్ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది. లక్షద్వీప్ తమకు ఎక్కడ పోటీ వస్తుందోనని ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు నోరుపారేసుకోవడం వల్ల దేశవ్యాప్తంగా బాయ్‌కాట్ మాల్దీవులు నినాదం ట్రెండింగ్‌లో నిలుస్తోంది. ప్రధాని మోదీ పర్యటన తర్వాత లక్షద్వీప్ గురించి గూగుల్ శోధించే వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా ఆల్ టైమ్ గరిష్ఠానికి చేరింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యటకులు లక్షద్వీప్ గురించి గూగుల్‌లో శోధించి తెలుసుకుంటున్నారు. మోదీ ఒక్క పర్యటన గూగుల్ సెర్చ్ ట్రెండ్‌లను సమూలంగా మార్చేసింది. జనవరి నాలుగో తేదీన భారత్‌లో అత్యధికంగా శోధించిన పదాల్లో లక్షద్వీప్ పదో స్థానంలో నిలిచింది.
లక్షద్వీప్‌లో ప్రధాని మోదీ పర్యటన అనంతరం ప్రపంచ పర్యటకుల చూపు భారత దీవులపై పడిందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వీటికోసం ఆన్‌లైన్‌లో భారీ ఎత్తున శోధిస్తున్నట్లు వెల్లడైంది. మోదీ పర్యటన తర్వాత లక్షద్వీప్ కోసం ఆన్‌లైన్‌లో అన్వేషిస్తున్న వారి సంఖ్య ఇరవై ఏళ్లలో గరిష్ఠ స్థాయికి చేరుకుందని కేంద్ర ప్రభుత్వ సమాచార విభాగాలు వెల్లడించాయి. శుక్రవారం రోజే 50వేల మంది లక్షద్వీప్ గురించి గూగుల్‌లో వెతికినట్లు కేంద్ర ప్రభుత్వ సమాచార విభాగం అంచనా వేసింది.
3వేల శాతం పెరిగిన మేక్‌మై ట్రిప్ సెర్చింగ్
తమ వెబ్‌సైట్‌లో లక్షద్వీప్ కోసం వెతుకుతున్న వారి సంఖ్య భారీగా పెరిగినట్లు ప్రముఖ ఆన్‌లైన్ ట్రావెల్ సంస్థ మేక్ మైట్రిప్ వెల్లడించింది. ప్రధాని మోదీ లక్షద్వీప్‌ను సందర్శించి వచ్చిన తర్వాత తమ సంస్థలో సైట్లలో లక్షద్వీప్ కోసం శోధనలు 3 వేల 400 శాతం పెరిగాయని మేక్ మైట్రిప్ వెల్లడించింది. భారత పర్యటకుల ఆసక్తిని గమనించి భారీ ఆఫర్‌లు, డిస్కౌంట్లతో బీచ్ ఆఫ్ ఇండియా ప్రచారాన్ని ప్రారంభించామని తెలిపింది.
భారత్‌కు ఇజ్రాయెల్ సాయం
మరోవైపు మాల్దీవులు, లక్షద్వీప్ మధ్య ఘర్షణ కొనసాగుతున్న వేళ ఇజ్రాయెల్ కీలక ప్రకటన చేసింది. లక్షద్వీప్‌లో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి భారత్‌కు అవసరమైన సాయం చేస్తామని ట్వీట్ చేసింది. భారత ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు లక్షద్వీప్‌లో సహజమైన నీటి అడుగున అందాలను పర్యాటకులకు అందించే ప్రాజెక్ట్ పనిని ప్రారంభిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.
మోదీపై వ్యాఖ్యలు- ముగ్గురు మాల్దీవుల మంత్రులు సస్పెండ్?
మోదీ లక్షద్వీప్ పర్యటన- ట్రెండింగ్‌లో 'బాయ్‌కాట్ మాల్దీవులు'- చర్యలు తీసుకుంటామన్న సర్కార్