ETV Bharat / bharat

'రాహుల్​కు పార్టీ పగ్గాలు అప్పగించండి'

కాంగ్రెస్ అధ్యక్షునిగా రాహుల్​ గాంధీని తక్షణమే ప్రకటించాలని దిల్లీ యూనిట్​ తీర్మానం చేసింది. ఇప్పటికే అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి తేదీలు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో దిల్లీ నాయకులు తీర్మానం పార్టీలో చర్చకు తెరలేపింది.

make rahul gandhi congress chief again delhi unit passes resolution
‘రాహుల్‌ను తక్షణమే అధ్యక్షుడిని చేయండి’
author img

By

Published : Jan 31, 2021, 10:05 PM IST

కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలకు ఇప్పటికే తేదీలు నిర్ణయించిన వేళ.. ఆ పార్టీ దిల్లీ యూనిట్‌ కీలక చర్చకు తెరతీసింది. రాహుల్‌ గాంధీని తక్షణమే అధ్యక్షుడిని చేయాలని తీర్మానం చేసింది. దీంతో రాహుల్‌ అధ్యక్ష ఎన్నిక అంశం మరోసారి తీసుకొచ్చినట్లయ్యింది. పార్టీ ఇతర రాష్ట్ర శాఖలు సైతం ఇలాంటి తీర్మానాలు చేసేలా ప్రోత్సహించినట్లయ్యింది.

కాంగ్రెస్‌ పార్టీలో నిర్ణయాత్మక మండలి అయిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) ఇటీవల భేటీ అయ్యి.. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన తేదీలను ప్రకటించింది. జూన్‌లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అయితే, ఆ గడువులోపే తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, కేరళ వంటి కీలక రాష్ట్రాలకు ఎన్నికలు పూర్తికానున్నాయి. అధ్యక్ష ఎన్నిక ప్రక్రియను మరీ ఇంత జాప్యం చేయడాన్ని ఓ వర్గం తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ దిల్లీ శాఖ తీర్మానం చేయడం గమనార్హం. గతంలోనూ ఒక రాష్ట్ర శాఖను చూసి ఇతర రాష్ట్రాల శాఖలు తీర్మానం చేసిన ఉదంతాలు ఉన్నాయి.

ఇదీ చూడండి: 'మన్​ కీ బాత్'​పై రాహుల్​ పరోక్ష విమర్శలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.