భారత వాయుసేన సామర్థ్యాన్ని మరింత పెంచేలా మరో 10 రఫేల్ యుద్ధవిమానాలు సైన్యంలో చేరనున్నాయి. మరో రెండు, మూడు రోజుల్లో మూడు రఫేల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి నేరుగా భారత్‌కు చేరుకుంటాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ఆ తర్వాత మరో 7లేదా 8 రఫేల్ యుద్ధవిమానాలు వచ్చేనెల మధ్యనాటికి భారత్‌కు చేరుకుంటాయని అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం భారత సైన్యం వద్ద 11 రఫేల్ యుద్ధవిమానాలు ఉన్నాయి. మొత్తం 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు కేంద్రం, ఫ్రాన్స్‌తో 2016లో ఒప్పందం కుదుర్చుకుంది.
ఇదీ చదవండి : యుద్ధం వచ్చినా భారత్- పాక్ మధ్య వీడని 'ఫోన్ బంధం'!