మహారాష్ట్రలో నకిలీ పాన్‌కార్డ్‌లు సృష్టిస్తున్న ఓ వ్యక్తిని (fake PAN card maker) పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన పాల్ఘర్ జిల్లా వాలివ్ ప్రాంతంలో జరిగింది.
జిల్లాలోని సాతివాలి గ్రామంలో సత్యప్రకాశ్ హిరలాల్ మౌర్య(29) ఓ ఫొటో స్టూడియో నిర్వహిస్తున్నాడు. ఈ షాప్‌లోనే నకిలీ పాన్ కార్డ్‌లు (fake PAN card) తయారు చేసి విక్రయిస్తున్నాడు. ముందస్తు సమాచారం అందుకున్న పోలీసులు.. షాప్‌పై దాడి చేశారు. ఈ క్రమంలో 18 నకిలీ పాన్ కార్డ్‌లను స్వాధీనం చేసుకున్నారు. రూ.1000కి ఒక కార్డును నిందితుడు తయారు చేసి విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ల్యాప్‌టాప్, ప్రింటర్, లామినేషన్ మెషిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి:ఆయిల్ ట్యాంకర్లో మంటలు- ఇద్దరు సజీవ దహనం