మహారాష్ట్ర పుణె జిల్లాకు చెందిన వేదిక అనే చిన్నారి అరుదైన వ్యాధితో ప్రాణాలు కోల్పోయింది. స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫీ అనే వ్యాధితో బాధపడుతున్న ఆ పసికందుకు.. రూ.16 కోట్ల విలువైన ఇంజెక్షన్‌ను అందించిన కొన్నినెలలకే ప్రాణాలు కోల్పోయింది.
చిన్నారి ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ తల్లిదండ్రులు ఎంతో శ్రమించారు. దాతల సాయంతో రూ.16 కోట్లు సమకూర్చారు. అమెరికా నుంచి ఆ వ్యాధిని నయం చేసే జోల్గెన్జామా ఓనాసెమ్నోజీనీ ఔషధాన్ని తెప్పించారు. చికిత్సలో భాగంగా జూన్ నెలలో ఆ ఇంజెక్షన్ అందించారు. అయితే ఇటీవల ఆరోగ్యం క్షీణించి.. ఆదివారం ఆ చిన్నారి కన్నుమూసింది.
ఇదీ చూడండి: చిన్నారికి 'రూ.16కోట్ల' ఉచిత చికిత్స