దేశంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహా పలు సందర్భాల్లో ప్రధాని మోదీ సూచించారు. ప్రస్తుతం పండుగ సీజన్ నడుస్తోంది. దీపావళి పర్వదినం దగ్గరపడుతున్న క్రమంలో ప్రజలు కరోనా భయాలను బేఖాతరు చేస్తూ.. కొనుగోళ్లకు మొగ్గు చూపుతుండటం వల్ల మార్కెట్లల్లో రద్దీ వాతావరణం కనిపిస్తోంది.
దిల్లీ.. జనపత్ ప్రాతంలో..
దేశ రాజధానిలో ఓవైపు కరోనా విజృంభిస్తున్నా.. దీపావళి షాపింగ్ కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో బయటికి వస్తున్నారు. జన్‌పత్ ప్రాంతంలోని మార్కెట్లో ఆదివారం దుకాణాలు, విక్రయ కేంద్రాల వద్ద రద్దీ పరిస్థితులు కనిపించాయి. భారీగా జనం తరలివచ్చారు.
మహారాష్ట్రలోనూ అదే పరిస్థితి..
దీపావళి సమీపిస్తున్న క్రమంలో మహారాష్ట్రలోనూ ప్రజలు పెద్ద ఎత్తున మార్కెట్లకు తరలివస్తున్నారు. నాగ్‌పుర్‌లోని సితాబుల్దీ మార్కెట్లో భారీ సంఖ్యలో ప్రజలు రావటం వల్ల రద్దీ ఏర్పడింది. చాలా మంది మాస్కులు లేకుండా రావటం, భౌతిక దూరం పాటించే అవకాశం లేకపోవటం వల్ల వైరస్ మరింత విజృంభించే ప్రమాదం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇదీ చూడండి: కరోనా పంజా- కేరళలో మరో 5వేల మందికి వైరస్