ETV Bharat / bharat

'మహా'లో తగ్గిన కేసులు.. దిల్లీలో 4.11శాతానికి పాజిటివిటీ రేటు - కరోనా వైరస్​

మహారాష్ట్రలో క్రితం రోజుతో పోలిస్తే కొత్త కేసులు స్వల్పంగా తగ్గాయి. మరో 2,922 మందికి వైరస్​ సోకింది. ముంబయిలోనే 1,745 మందికి పాజిటివ్​గా తేలింది. దిల్లీలో కొత్త కేసులు భారీగా నమోదయ్యాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 4.11 శాతానికి చేరింది.

COVID19 cases
కరోనా కేసులు
author img

By

Published : Jun 11, 2022, 9:36 PM IST

మహారాష్ట్రలో కొద్ది రోజులుగా రోజు రోజుకు పెరుగుతున్న కొవిడ్​ కేసులు.. క్రితం రోజుతో పోలిస్తే శనివారం స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం 3,081 మందికి వైరల్​ సోకగా.. శనివారం 2,922 మందికి పాజిటివ్​గా తేలింది. వైరస్​ కారణంగా ఒకరు మృతి చెందారు. మరోవైపు.. మే 12న ఇంగ్లాండ్​ నుంచి వచ్చిన పుణెకు చెందిన 37 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్​ ఉపరకం బీఏ.5 నిర్ధరణ అయినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 79,07,631కి చేరగా.. మరణాలు 1,47,868కి చేరాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 14,858 క్రియాశీల కేసులు ఉన్నాయి. శనివారం ఒక్కరోజే 1,392 మంది వైరస్​ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

మరోవైపు.. మొత్తం కేసుల్లో ముంబయి మహానగరంలోనే అత్యధికంగా నమోదయ్యాయి. శనివారం కొత్తగా 1,745 మందికి వైరస్​ సోకింది. ఆ తర్వాత నవీ ముంబయి 238, ఠాణె 185, పుణెలో 140 కేసులు వచ్చాయి. మరణం సైతం ముంబయిలోనే నమోదవటం ఆందోళన కలిగిస్తోంది. ఒమిక్రాన్​ ఉపవేరియంట్​ నిర్ధరణ అయిన వ్యక్తి వైరస్​ నుంచి కోలుకున్నట్లు అధికారులు తెలిపారు.

దిల్లీలో 4.11 శాతానికి పాజిటివిటీ రేటు
దిల్లీలో దాదాపు నెల రోజుల తర్వాత భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. శనివారం కొత్తగా 795 మందికి వైరస్​ నిర్ధరణ కాగా.. పాటిజివిటీ రేటు 4.11 శాతానికి చేరింది. గతంలో మే 13న రోజువారీ కేసులు 899 మందికి వైరస్​ నిర్ధరణ కాగా.. పాజిటివిటీ రేటు 3.34 శాతంగా నమోదైంది. గత గురువారం, శుక్రవారం రోజువారీ కేసులు 600లకుపైగా నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

దేశంలో కొవిడ్​ కేసులు మళ్లీ భారీగా పెరిగాయి. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు 8,329 మంది వైరస్​ బారిన పడ్డారు. 10 మంది మహమ్మారి వల్ల ప్రాణాలు విడిచారు. శుక్రవారం 4,216 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.69 శాతానికి చేరింది. మృతుల సంఖ్య 1.21 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసుల సంఖ్య 0.09 శాతం వద్ద ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 2.41 శాతం ఉండగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 1.75 శాతంగా ఉంది. సుమారు 103 రోజుల తర్వాత దేశంలో 8వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

ఇదీ చూడండి: తండ్రికి గుడికట్టిన నలుగురు అన్నదమ్ములు.. నిత్యం పూజలు

వరుడు కావాలని యాడ్ ఇచ్చిన యువతి.. అబ్బాయి అలా ఉంటేనే పెళ్లి..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.