ETV Bharat / bharat

ప్రపంచం మెచ్చిన.. 'మహో'పాధ్యాయుడు

రోజూ పాఠశాలకు వచ్చామా.. పాఠం చెప్పామా.. జీతం అందుకున్నామా అని మాత్రమే ఊరుకోలేదు ఆ ఉపాధ్యాయుడు. విద్యలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాడు. పశువుల పాకలా ఉన్న తన బడి రూపురేఖలను పూర్తిగా మార్చేశాడు. విద్యార్థుల హాజరును నూరు శాతానికి చేర్చాడు. ఆయన చేసిన అద్వితీయమైన కృషికి ఇప్పుడో సమున్నత గౌరవం దక్కింది. 'గ్లోబల్​ టీచర్స్​ ప్రైజ్​ మనీ-2020' బహుమతి వరించింది.

maharashtra school teacher from India won Global Teacher Prize 2020
ప్రపంచం మెచ్చిన.. 'మహో'పాధ్యాయుడు
author img

By

Published : Dec 4, 2020, 5:51 AM IST

Updated : Dec 4, 2020, 6:47 AM IST

మహారాష్ట్రకు చెందిన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రంజిత్​సింగ్ డిసలేకు అరుదైన గౌరవం దక్కింది. 'గ్లోబల్ టీచర్స్​ ప్రైజ్​మనీ-2020' వరించింది. ఇందుకు బహుమతిగా రూ.7.38 కోట్ల నగదును అందుకోనున్నారు. పాఠశాలలో విద్యార్థుల హాజరు నూరు శాతం ఉండేలా చేయడమే కాకుండా, పాఠ్యపుస్తకాలకు క్యూఆర్​ కోడ్​ను ప్రవేశ పెట్టి విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టినందుకు గానూ రంజిత్​ సింగ్​ డిసలేను ఈ బహుమతి లభించింది.

యునెస్కో భాగస్వామ్యంతో వర్కే ఫౌండేషన్​ ఏటా ఈ గ్లోబల్ టీచర్స్​ ప్రైజ్​మనీ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ ఏడాదికిగాను లండన్​లోని నేచురల్​ హిస్టరీ మ్యూజియంలో ఈ ఎంపిక కార్యక్రమం జరిగింది. ఈ బహుమతి కోసం 140 దేశాల నుంచి మొత్తం 12 వేలకు పైగా నామినేషన్లు వచ్చాయని ఫౌండేషన్​ ప్రతినిధులు తెలిపారు. ఈ అవార్డు తుది జాబితాకు మొత్తం 10మందిని ఎంపిక చేయగా... వారందరిలో రంజిత్​ సింగ్​ డిసలే విజేతగా నిలిచాడని ప్రకటించారు.

వారికి సగం డబ్బులు..

తనకు అందిన ఈ బహుమతిలో సగం డబ్బులను తనతో పాటు తుది జాబితాలో నిలిచిన మిగతా తొమ్మిది మంది ఉపాధ్యాయులకు అందిస్తానని తెలిపారు రంజిత్​ సింగ్​ డిసలే.

"ప్రపంచాన్ని నిజంగా మార్చగలిగేది ఉపాధ్యాయులే. సమాజానికి పంచి పెట్టడంలో వారు ఆనందం పొందుతారు. అందుకే నాకు వచ్చే ప్రైజ్​ మనీలో సగం తోటి పోటీదారులతో పంచుకుంటా. ఉపాధ్యాయులుగా వారెంతో కృషి చేస్తున్నారు. "

--రంజిత్​ సింగ్​ డిసలే, ఉపాధ్యాయుడు

రంజిత్​సింగ్​కు ఈ గుర్తింపు దక్కడంపై మహారాష్ట్ర గవర్నర్​ భగత్​సింగ్​ కోశ్యారీ హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు అభినందనలు తెలిపారు.

ఇదీ చూడండి:5 గంటల్లో 50 కుర్చీలు అల్లి అంధుల ప్రపంచ రికార్డు

Last Updated : Dec 4, 2020, 6:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.