ETV Bharat / bharat

'మహా'లో మళ్లీ పెరిగిన కరోనా కేసులు - దిల్లీ కరోనా కేసులు

దేశంలో కరోనా మళ్లీ పంజా విసురుతోంది. వివిధ రాష్ట్రాల్లో నమోదవుతోన్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. మహారాష్ట్రలో కొత్తగా 28 వేల 699 మందికి వైరస్​ సోకింది. మరోవైపు గుజరాత్​లో ఒక్కరోజులో రికార్డు స్థాయి కేసులు నమోదయ్యాయి. దేశ రాజధానిలోనూ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.

Maharashtra reports 28,699 new #COVID19 cases, 13,165 recoveries, and 132 deaths in the last 24 hours Total cases 25,33,026
'మహా'లో మళ్లీ ఎగసిన కరోనా-తగ్గని మహమ్మారి ఉద్ధృతి
author img

By

Published : Mar 23, 2021, 10:40 PM IST

దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో మహమ్మారి విజృంభిస్తోంది. ఆ రాష్ట్రంలో కొత్తగా 28 వేల 699 మంది వైరస్​ బారిన పడ్డారు. మరో 132 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • మొత్తం కేసులు: 25,33,026
  • మొత్తం రికవరీలు: 22,47,495
  • మొత్తం మరణాలు: 53,589

గుజరాత్​లో కేసులు..

గుజరాత్​లో మహమ్మారి మొదలైనప్పటి నుంచి నేటి వరకు రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ఇవాళ ఒక్కరోజే 1,730 మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

  • మొత్తం కేసులు: 2,90,379
  • మొత్తం రికవరీలు: 2,77,603
  • మొత్తం మరణాలు: 4,458
  • యాక్టివ్​ కేసులు: 8,318

దిల్లీలో కేసులు..

దిల్లీలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా మరో 1,101 మందికి వైరస్​ సోకింది. మరో నలుగురు మృతి చెందారు.

  • మొత్తం కేసులు: 6,49,973
  • మొత్తం రికవరీలు: 6,34,595
  • మొత్తం మరణాలు: 10,967
  • యాక్టివ్​ కేసులు: 5,035

జోరుగా వ్యాక్సినేషన్​..

దేశంలో టీకా పంపిణీ కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. మంగళవారం నాటికి 5,00,75,162 టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. మరోవైపు ఇవాళ ఒక్కరోజే 15,80,568 టీకా డోసులు అందజేసినట్లు తెలిపింది.

ఇదీ చదవండి: 'క్రియాశీల కేసులు, మరణాలు 2 శాతం లోపే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.