ETV Bharat / bharat

మురికివాడలోని మహిళల కోసం 'పీరియడ్​ రూమ్' - Thane slum news

మురికివాడలో నివసిస్తున్న మహిళల ఇబ్బందులు తగ్గించడానికి 'పీరియడ్​ రూమ్​' ఏర్పాటు చేసింది మహారాష్ట్రలోని ఓ మున్సిపల్​ కార్పొరేషన్. దీంతో ఆ ప్రాంతంలో నివసించే మహిళలకు గొప్ప ఉపశమనం కలుగుతుందని అధికారులు పేర్కొన్నారు.​

Maharashtra: 'Period room' set up for women in Thane slum
మురికివాడలోని మహిళల కోసం 'పీరియడ్​ రూమ్'
author img

By

Published : Jan 10, 2021, 1:30 PM IST

రుతుస్రావం సమయంలో మహిళలు పడే బాధ అంతా ఇంతా కాదు. పరిశుభ్రం లేని మురికివాడల్లో నివసించే మహిళలు పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. అటువంటి వారి ఇబ్బందులు తగ్గించడానికి పబ్లిక్ టాయిలెట్ వద్ద 'పీరియడ్ రూమ్​'ను ఏర్పాటు చేశారు మహారాష్ట్ర థానే మున్సిపల్​ కార్పొరేషన్​ అధికారులు. పరిశుభ్రమైన పారిశుధ్య సౌకర్యాలు కల్పించే ప్రయత్నంలో భాగంగా ఓ ఎన్​జీవో సహకారంతో శాంతినగర్​ ప్రాంతంలో దీనిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

తొలిసారిగా ఏర్పాటు చేసిన ఈ 'పీరియడ్​ రూమ్'​లో జెట్​ స్ప్రే, టాయిలెట్​ రోల్​, సబ్బు, చెత్తడబ్బా, యూరినల్​, నిరంతరం నీటి సౌకర్యాలను కల్పించినట్లు అధికారులు వెల్లడించారు. 'పరిశుభ్రత పాటించాలి' అని గది గోడల మీద రాసినట్లు చెప్పారు. ఈ రూమ్​ ఏర్పాటుకు రూ.45వేల ఖర్చు అయినట్లు తెలిపారు.

నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఈ విధమైన ఏర్పాట్లు చేస్తామని అధికారులు పేర్కొన్నారు. రుతుస్రావం సమయంలో ఈ గదులు మహిళలకు ఎంతో ఉపశమనం కలిగిస్తాయన్నారు.

ఇదీ చూడండి: టీకా పంపిణీ.. ఎప్పుడు, ఎక్కడ, ఎలా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.