ETV Bharat / bharat

స్మార్ట్​ఫోన్​ సాయంతో ఇంటి వద్దే ఈసీజీ పరీక్ష! - స్మార్ట్​ ఫోన్​కు అనుసంధానించే ఈసీజీ పరికరం

ఈసీజీ గ్రాఫ్​ కోసం ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కొత్త పరికరాన్ని రూపొందించారు మహారాష్ట్రకు చెందిన నలుగురు యువకులు. ఆ పరికరాన్ని స్మార్ట్​ ఫోన్​కు అనుసంధానించి.. ఎక్కడి కావాలంటే అక్కడ, ఎప్పుడు కావాలంటే అప్పుడు క్షణాల్లోనే ఈసీజీ రిపోర్ట్ తీసుకోవచ్చు.

ECG
క్షణాల్లో ఈసీజీ
author img

By

Published : Aug 4, 2021, 1:51 PM IST

స్మార్ట్​ఫోన్​ సాయంతో ఈసీజీ పరీక్ష

ఈసీజీ గ్రాఫ్​ తెలుసుకోవాలంటే మెడికల్ ల్యాబ్​లకు వెళ్లాల్సిందే. అయితే ఈ శ్రమ లేకుండా.. ఒక్క క్లిక్​తోనే మనం ఉన్నచోటే ఈసీజీ తీసేలా ఓ పరికరాన్ని రూపొందించారు మహారాష్ట్ర ఔరంగబాద్​ జిల్లాకు చెందిన నలుగురు యువకులు. ప్రతీక్​ తొద్కర్​, డాక్టర్​ తన్వీ నికల్జీ, మిహిర్​ గైక్వాడ్​, గౌతమ్​​ బృందం అభివృద్ధి చేసిన ఈ విప్లవాత్మక పరికరాన్ని 'ఈడీ కార్డియోప్లోట్​ 12' అని పిలుస్తారు.

ECG on smartphone within a minute
ఈడీ కార్డియోప్లోట్​ 12 పరికరం

ఎలా పని చేస్తుంది?

'ఈడీ కార్డియోప్లోట్ 12' పరికరం సాధారణ ఈసీజీ యంత్రంలానే పని చేస్తుంది. రోగి శరీరానికి అమర్చిన ఈసీజీ లీడ్స్​ను కార్డియోప్లోట్ 12 పరికరానికి జోడించాలి. తర్వాత ఆ పరికరాన్ని యూఎస్​బీ కేబుల్​ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానించాలి. స్మార్ట్‌ఫోన్‌లోని సాఫ్ట్‌వేర్ 10 సెకన్లలో ఆ పరికరాన్ని గుర్తించి.. ఈసీజీ తీయడం ప్రారంభిస్తుంది.

ECG on smartphone within a minute
స్మార్ట్​ ఫోన్​లో ఈసీజీ గ్రాఫ్​

ఫీచర్లు

ఈడీ కార్డియోప్లోట్​ 12ను ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు. ఇది ఫోన్​ ఛార్జింగ్​ ద్వారానే పని చేస్తుంది. దీనికి ప్రత్యేకంగా ఛార్జింగ్​ పెట్టాల్సిన అవసరం లేదు. దీనిని సామాన్యులు సైతం సులభంగా ఆపరేట్​ చేసేలా రూపకల్పన చేశారు. ఈ పరికరం సాయంతో ఎప్పుడు కావాలంటే అప్పుడు.. ఈజీసీ గ్రాఫ్​ను పొందవచ్చు. అవసరమైతే డిజిటల్​ కాపీని డాక్టర్​కు పంపించవచ్చు.

ECG on smartphone within a minute
స్మార్ట్​ ఫోన్​లో ఈసీజీ గ్రాఫ్​

గతేడాదిలో మూడు వేర్వేరు దశల్లో ఈ పరికరాన్ని పరీక్షించారు. చివరిగా నాలుగో దశలో విజయవంతంగా దీనిని పరీక్షించినట్లు రూపకర్తలు తెలిపారు. అనంతరం గ్రామీణ ప్రాంతాల్లోని రెండు ఆసుపత్రులలో ఈడీ కార్డియోప్లోట్​తో పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈసీజీ పరికరాల కంటే మెరుగ్గా పని చేస్తున్నట్లు చెబుతున్నారు.

ఇదీ చూడండి: రైళ్లలో వ్యర్థాల నిల్వ సమస్యకు.. నూతన సాంకేతికతతో చెక్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.