ETV Bharat / bharat

మోడల్​ ఆత్మహత్యపై ఆరోపణలు.. మంత్రి రాజీనామా! - శివసేన మంత్రి రాజీనామా

ప్రముఖ మోడల్​ పూజా చౌహాన్​ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర అటవీశాఖ మంత్రి సంజయ్​ రాఠోడ్​ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.

'Maharashtra minister Sanjay Rathod resigns from cabinet'
మోడల్​ ఆత్మహత్య కేసులో మహారాష్ట్ర మంత్రి రాజీనామా!
author img

By

Published : Feb 28, 2021, 4:13 PM IST

Updated : Feb 28, 2021, 5:06 PM IST

మహారాష్ట్ర అటవీ శాఖ మంత్రి సంజయ్​ రాఠోడ్​ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రేకు అందించారు. ఫిబ్రవరి 8న జరిగిన ప్రముఖ మోడల్​ పూజా చౌహాన్​ ఆత్మహత్య కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

దీనినే ప్రధానాస్త్రంగా చేసుకొని ప్రతిపక్ష భాజపా విమర్శలు చేస్తోంది. ఆయన్ను మంత్రివర్గం నుంచి తప్పించాలని డిమాండ్‌ చేసింది. భాగస్వామ్య పార్టీలైన ఎన్సీపీ, కాంగ్రెస్ సహా విపక్షాల​ నుంచి ఒత్తిడి పెరగటం వల్ల ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న శివసేన తమ పార్టీకి చెందిన రాఠోడ్​తో రాజీనామా చేయించినట్లు తెలుస్తోంది.

"నా రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి అందజేశాను. భాజపా నాయకులు నాపై అనవసర ఆరోపణలు చేస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో నిజానిజాలు బయటకు వస్తాయి. 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. నాకు ఉన్న మంచి పేరును చెడగొట్టాలని చూస్తున్నారు. ఈ విషయాన్ని సాకుగా చూపి బడ్జెట్​ సమావేశాలను అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయి."

-సంజయ్​ రాఠోడ్​

ఇదీ చూడండి: కాంగ్రెస్​లో జీ23 గుబులు- చీలిక ఖాయమా?

Last Updated : Feb 28, 2021, 5:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.