ETV Bharat / bharat

మన్‌సుఖ్‌ హిరేన్‌ మృతి కేసులో కీలక మలుపు - మహారాష్ట్ర సచిన్ వాజే

ముకేశ్​ అంబానీ ఇంటి పరిసరాల్లో పేలుడు పదార్థాల కారు యజమానిగా అనుమానిస్తున్న మన్‌సుఖ్‌ హిరేన్‌ మృతి కేసు కీలక మలుపు తిరిగింది. మృతదేహం దొరికిన మితి నదిలో గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు.. కంప్యూటర్‌ సీపీయూ, వాహనం నంబర్‌ ప్లేట్​ వంటి కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. మన్​సుఖ్ మృతి వరకు ఇవన్నీ సచిన్​ వాజే కస్టడీలో ఉండేవని అధికారులు పేర్కొన్నారు.

Maharashtra: Divers of NIA recover computer CPUs
మన్‌సుఖ్‌ హిరేన్‌ కేసులో కీలక ఆధారాలు లభ్యం
author img

By

Published : Mar 28, 2021, 5:55 PM IST

Updated : Mar 28, 2021, 6:21 PM IST

రిలయన్స్‌ గ్రూప్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్ధాల వాహనం ఉంచిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్ధ (ఎన్​ఐఏ) కీలక పురోగతి సాధించింది. సంబంధిత వాహన యజమానిగా భావిస్తున్న మన్‌సుఖ్‌ హిరేన్‌ అనుమానాస్పదంగా మృతి చెందిన ముంబయిలోని మితి నది నుంచి దర్యాప్తు బృందాలు కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నాయి.

Maharashtra: Divers of NIA recover computer CPUs
పోలీసులు వెలికితీసిన ల్యాప్​టాప్

గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు

పోలీసులు స్వాధీనం చేసుకున్న సీపీయూ, ల్యాప్​టాప్​

వెలికితీసిన నంబర్‌ ప్లేట్​ను‌ చూపిస్తోన్న ఈతగాడు

నదిలో గాలింపు జరిపిన గజ ఈతగాళ్లు కంప్యూటర్‌ సీపీయూ, ఓ వాహనం నంబర్‌ ప్లేట్‌ను వెలికి తీశారు. హిరేన్​ మృతి వరకు ఇవన్నీ ముంబై మాజీ పోలీసు అధికారి సచిన్ వాజే కస్టడీలో ఉండేవని అధికారులు పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో ఇవి కీలకం కాగలవని భావిస్తున్నారు.

ఇదీ చదవండి: విశ్రాంత జడ్జితో 'మహా' హోంమంత్రిపై విచారణ!

Last Updated : Mar 28, 2021, 6:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.