ప్రస్తుతం ఉన్నట్లుగానే మహారాష్ట్రలో వైరస్ వ్యాప్తి కొనసాగితే లాక్డౌన్ విధించక తప్పదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. రానున్న రోజుల్లో మహారాష్ట్రలో రోజుకు 2.5 లక్షల ఆర్టీ పీసీఆర్ టెస్టులు చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఇప్పటివరకు రాష్ట్రంలో 65 లక్షల మందికి టీకా ఇచ్చినట్లు పేర్కొన్న సీఎం.. గురువారం ఒక్కరోజే 3 లక్షల మందికి టీకా వేసినట్లు చెప్పారు. మాస్కు ధరించే విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్న వారికి టీకా తీసుకున్నాక కూడా వైరస్ సోకుతుందని అన్నారు.
మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి తీవ్రతరమవుతున్న నేపథ్యంలో శుక్రవారం రాత్రి ప్రజలను ఉద్దేశించి ప్రసగించారు ఉద్ధవ్ ఠాక్రే.
ఇదీ చదవండి:టికాయిత్ కాన్వాయ్‌పై దుండుగుల దాడి