ETV Bharat / bharat

ఆశ్రమ పాఠశాలలో 30 మంది విద్యార్థులకు కరోనా - పాల్​గఢ్​ ఆశ్రమ పాఠశాల

మహారాష్ట్రలో కొవిడ్​-19 అంతకంతకూ విజృంభిస్తోంది. ఓ ఆశ్రమ పాఠశాలలో 30 మంది విద్యార్థులు, ఓ టీచర్ వైరస్​​ బారినపడ్డారు. ఆ పాఠశాలను కంటైన్​మెంట్​ జోన్​గా ప్రకటించినట్టు స్థానిక అధికారులు తెలిపారు.

30 children from ashram school test COVID-19 positive in Maharashtra
ఆశ్రమ పాఠశాలలో 30మంది విద్యార్థులకు కరోనా
author img

By

Published : Mar 17, 2021, 7:32 PM IST

మహారాష్ట్రలో కరోనా​ కలకలం రేపుతోంది. పాల్​గఢ్​లోని నందోర్​ ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో 30 మంది విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. వారితో పాటు ఓ టీచర్​కూ​ వైరస్​ సోకినట్టు తేలింది.

మొత్తం 193 మంది విద్యార్థులున్న ఆ పాఠశాలలో కొందరు విద్యార్థుల్లో ఇటీవల కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే టెస్టింగ్​ నిర్వహించినట్టు ఆరోగ్య అధికారులు తెలిపారు. వైరస్​ సోకిన వారందరినీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. ఆ పాఠశాలను కంటైన్​మెంట్​ జోన్​గా ప్రకటించినట్టు వెల్లడించారు.

గత వారం.. జవహార్​లోని మూడు ఆశ్రమ పాఠశాలల్లో కరోనా పరీక్షలు నిర్వహించగా 79 మంది వైరస్​ బారినపడ్డారు. బాధితుల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది ఉన్నారు.

ఇదీ చదవండి: కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌: ఆంక్షల దిశగా రాష్ట్రాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.