ETV Bharat / bharat

ఆరో తరగతి బాలికకు బొట్టు పెట్టిన 8th క్లాస్ స్టూడెంట్​.. ప్రేమిస్తున్నానంటూ మెడపై కత్తి పెట్టి.. - ఆరో తరగతి విద్యార్థినిని కత్తితో బెదిరించిన బాలుడు

ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి.. ఆరో తరగతి చదువుతున్న విద్యార్థినిని కత్తితో బెదిరించి.. ఆమె నుదుటన తిలకం దిద్దాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ వింత ఘటన ఉత్తర్​ప్రదేశ్​ మహారాజ్‌గంజ్​లో జరిగింది.

maharajganj molestation case
నుదుటన కుంకుమ తిలకం దిద్దిన విద్యార్థి
author img

By

Published : Jan 9, 2023, 10:27 PM IST

ఉత్తర్​ ప్రదేశ్​లో ఓ ఎనిమిదో తరగతి విద్యార్థి.. ఆరో తరగతి చదివే విద్యార్థినిపై మనసు పడ్డాడు. ఆ విషయం ఆ బాలికకు కూడా చెప్పాడు. కానీ ఆ బాలిక అతడ్ని పట్టించుకోలేదు. అయినా సరే ఆ బాలుడు అక్కడితో ఆగలేదు.. ఆమె ఇంటికి చేరుకుని.. మెడపై కత్తిపెట్టి నుదుటన తిలకం దిద్దాడు. ఈ వింత ఘటన శనివారం జరగగా.. పోలీసులు ఆ నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మహారాజ్‌గంజ్ జిల్లాలో ఈ వింత ఘటన వెలుగు చూసింది. సిందూరియా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థి మహారాజ్​గంజ్ ప్రాంతంలోని ఓ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. బాధిత బాలిక కూడా గతంలో అదే స్కూల్​లో చదువేది. ఆ సమయంలో నిందితుడు ఆ బాలికను ప్రేమ పేరుతో వేధించేవాడు. వేధింపులు తాళలేక బాలిక ఆ విషయం తన తండ్రికి చెప్పింది. అయితే.. ఈ విషయం బయటకు వస్తే తమ పరువుపోతుందనే ఉద్దేశంతో బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అనంతరం తన కుమారైను నగరంలోని మరో పాఠశాలకు మార్చాడు. బాలిక స్కూల్​ మారినా సరే.. నిందితుడు ఆమె వెంటపడి వేధించడం ఆపలేదు.

శనివారం సాయత్రం నిందితుడు తన స్నేహితుడితో కలిసి బైక్​పై బాలిక ఇంటికి వచ్చాడు. ఇంట్లోకి ప్రవేశించిన నిందితుడు బాలిక చేతిని పట్టుకుని.. తన వెంట తెచ్చుకున్న కత్తిని ఆమె గొంతుపై పెట్టాడు. అనంతరం ఆమె నుదుటన సింధూరం పెట్టి అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ విషయాన్ని బాలిక తన తండ్రికి తెలియజేయగా.. సదర్​ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో.. పోలీసులు నిందితుడిపై పలు సెక్షన్​ల కింద కేసు నమోదు చేసి.. అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మైనర్ కావడం వల్ల ఆదివారం ఉదయం జువైనల్ కోర్టులో హాజరుపరిచినట్లు ఏఎస్పీ అజయ్ సింగ్ చౌహన్​ వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.