లడ్డూ మ్యాగీ.. ఎప్పుడైనా విన్నారా? పోనీ పెరుగు మ్యాగీ తిన్నారా? ఏంటీ.. ఏదో తేడాగా ఉందే అనిపిస్తోందా? నిజమే.. మనం ఎప్పుడూ ట్రై చేయని వింత మ్యాగీ రెసిపీలతో భయపెట్టేస్తున్నారు కొందరు నెటిజన్లు. మ్యాగీని ఎంతో ఇష్టంగా తినే మనం.. వాటిని చూశాక జీర్ణించుకోవడం కొంచెం కష్టమే. అయినా ఒకసారి ట్రై చేస్తే పోలే అనుకుంటే.. కానిచ్చేయండి.
లడ్డూ మ్యాగీ..
-
Isn't the world suffering enough that someone had to go make Maggi ladooos?
— Zenia Irani (@ZeniaIrani) April 14, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
(Source: Facebook) pic.twitter.com/f6irL87Lhc
">Isn't the world suffering enough that someone had to go make Maggi ladooos?
— Zenia Irani (@ZeniaIrani) April 14, 2021
(Source: Facebook) pic.twitter.com/f6irL87LhcIsn't the world suffering enough that someone had to go make Maggi ladooos?
— Zenia Irani (@ZeniaIrani) April 14, 2021
(Source: Facebook) pic.twitter.com/f6irL87Lhc
కారం, తీపి.. రెండు రుచుల్లో లడ్డూ మ్యాగీని చేస్తున్నారు. కారంగా కావలంటే.. ఫ్రైడ్ మ్యాగీని ఎర్రటి క్యాప్సికమ్, ఫ్రై చేసిన బ్రెడ్ ముక్కలు, జున్ను, ఎండు మిర్చి, తులసీ ఆకులతో కలిపి.. పకోడీలు వేయించినట్టు వేయించాలి. తర్వాత సాస్‌తో తినొచ్చు. తీపిగా అంటే.. బెల్లం, ఎలక్కాయ, వెన్నను వేడి చేసి న్యూడిల్స్‌తో కలిపి ఉండలుగా చేసి పెట్టాలి.
మ్యాగీ పానీ పూరీ..
-
Maggi Pani Puri pic.twitter.com/XGV9CcGD0U
— Saharsh (@whysaharsh) June 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Maggi Pani Puri pic.twitter.com/XGV9CcGD0U
— Saharsh (@whysaharsh) June 3, 2020Maggi Pani Puri pic.twitter.com/XGV9CcGD0U
— Saharsh (@whysaharsh) June 3, 2020
ఎంతోమందికి ఇష్టమైన పానీపూరీలో మ్యాగీ ట్రై చేశాడు ఓ ట్విట్టర్ వినియోగదారుడు. ఆ ఫొటోను పోస్టు చేశాడు. దీంతో పానీపూరీ అభిమానులు కాస్తా.. అతడిపై కారాలు మిరియాలు నూరుతున్నారు.
ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. చాక్లెట్ మ్యాగీ, పెరుగు మ్యాగీ మరో ఎత్తు.
-
Once again i will cook CHOCLATE MAGGIE today. 🙄 pic.twitter.com/EslMi5akT8
— राहुल 🇮🇳 (@rahulpassi) June 18, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Once again i will cook CHOCLATE MAGGIE today. 🙄 pic.twitter.com/EslMi5akT8
— राहुल 🇮🇳 (@rahulpassi) June 18, 2020Once again i will cook CHOCLATE MAGGIE today. 🙄 pic.twitter.com/EslMi5akT8
— राहुल 🇮🇳 (@rahulpassi) June 18, 2020
మొదటి దాంట్లో.. మ్యాగీతో పాటే చాక్లెట్ ఉడకపెడుతుండగా.. రెండో దాంట్లో మ్యాగీ అయ్యాక పెరుగు కలిపి తింటున్నారు.
-
Maggi and curd is food for the soul ❤️ pic.twitter.com/RmNRVRvnfw
— aashiqui (@acnymph) November 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Maggi and curd is food for the soul ❤️ pic.twitter.com/RmNRVRvnfw
— aashiqui (@acnymph) November 16, 2020Maggi and curd is food for the soul ❤️ pic.twitter.com/RmNRVRvnfw
— aashiqui (@acnymph) November 16, 2020
ఈ పోకడలు వింతో, వెర్రో.. తెలియాలంటే ఓసారి ట్రై చేసి చూడాల్సిందే..!
ఇదీ చూడండి: కియారా వేసుకున్న ఈ డ్రెస్ పేరు తెలుసా..?