ETV Bharat / bharat

సోలోగా 25వేల కి.మీ సైకిల్​ యాత్ర.. ఆ విషయం ప్రూవ్ చేసేందుకు ఆశ సాహసం - ఆశా మాలవీయ లేటెస్ట్ న్యూస్

25వేల కిలోమీటర్లు.. సైకిల్​పై ఒంటరి ప్రయాణం.. ఇదీ ఓ యువతి చేస్తున్న సాహసం! ఇప్పటికే 6 వేల కిలోమీటర్లు సైకిల్​ తొక్కి, ఐదు రాష్ట్రాల్ని చుట్టేసిందామె. ఇలా చేయడం వెనుక పెద్ద కారణమే ఉందట. అదేంటంటే..

woman cycling across india
ఆశా మాలవీయ సైక్లింగ్
author img

By

Published : Dec 29, 2022, 11:42 AM IST

సోలోగా 25వేల కి.మీ సైకిల్​ యాత్ర.. ఆ విషయం ప్రూవ్ చేసేందుకు ఆశ సాహసం

భారత్​లో మహిళల భద్రతపై కొందరిలో ఉన్న అనుమానాలు పటాపంచలు చేసేందుకు నడుంబిగించింది ఓ యువతి. ఒంటరిగా 25 వేల కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేపట్టింది. ఇప్పటికే ఐదు రాష్ట్రాల్లో ఆరువేల కిలోమీటర్ల యాత్ర పూర్తి చేసిన యువతి.. మిగతా యాత్రను దిగ్విజయంగా పూర్తి చేస్తానని చెబుతోంది. ఆమే మధ్యప్రదేశ్​కు చెందిన ఆశా మాలవీయ. 2022 నవంబరు 1న మధ్యప్రదేశ్​లోని భోపాల్​లో సైకిల్ యాత్ర ప్రారంభించింది ఆశా. ఇప్పటికే మధ్యప్రదేశ్, గుజరాత్​, మహారాష్ట్ర, గోవా, కేరళలో ఈ యాత్ర పూర్తయింది.

woman cycling across india
పోలీసులతో ఆశా మాలవీయ

'సంపూర్ణ భారత్​ యాత్ర' ద్వారా దేశం​లో మహిళా భద్రత, సాధికారత గురించి సందేశమిచ్చేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పింది ఆశ. ఇప్పటి వరకు కేరళ గవర్నర్ ఆరిఫ్ అహ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్​నాథ్ శిందే, గోవా సీఎం ప్రమోద్ సావంత్​ను కలిశానని తెలిపింది. తానొక పేద కుటుంబంలో జన్మించానని.. అక్క, తల్లితో కలిసి జీవిస్తున్నానని చెప్పింది.

woman cycling across india
గోవా సీఎం ప్రమోద్ సావంత్​తో ఆశా మాలవీయ

దేశవ్యాప్తంగా 25 వేల కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేయాలనుకుంటున్నా. భారత్..​ మహిళలకు సురక్షితమైన ప్రదేశం కాదని విదేశీయులు భావిస్తారు. అయితే నా సైకిల్ యాత్ర ద్వారా మహిళలకు భారత్ సురక్షితమైన ప్రదేశమని సందేశం ఇచ్చేందుకు సిద్ధమయ్యా. నేను పర్వాతారోహకురాలిని. మహారాష్ట్ర, గోవా, కేరళ ముఖ్యమంత్రులను కలిశాను.

--ఆశా మాలవీయ, సైకిల్ యాత్ర చేస్తున్న యువతి

woman cycling across india
ఆశా మాలవీయ
ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.