ETV Bharat / bharat

15 ఏళ్ల బాలికపై గ్యాంగ్​ రేప్​.. నిందితుల్లో మైనర్​ - లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ

15ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన పాశవిక ఘటన మధ్యప్రదేశ్​లో వెలుగుచూసింది. ఈ నేరానికి సంబంధించి ఓ మైనర్​ సహా.. మరో వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

rape
రేప్
author img

By

Published : Dec 12, 2021, 10:03 PM IST

మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో 15 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆరోన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో డిసెంబర్ 9న అర్ధరాత్రి జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగుచూసింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఐపీసీ, పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

'గురువారం అర్ధరాత్రి బహిర్భూమికి వెళ్లిన బాలికను.. నిందితులిద్దరూ ఓ గదిలోకి తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని బెదిరించారు.' అని గుణ జిల్లా ఎస్పీ రాజీవ్ మిశ్రా తెలిపారు. ఈ ఘటనలో 20 ఏళ్ల ఛోటూ కుష్వాహా అనే వ్యక్తితో పాటు.. ఓ బాలుడిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

ఆదివారం కుష్వాహాను స్థానిక కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. మైనరైన నిందితుడిని జువనైల్​ కోర్టులో హాజరుపరి బాలల సంరక్షణ గృహానికి పంపినట్లు పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.