కరోనా డెల్టా వేరియంట్ మిగిల్చిన నష్టం నుంచి దేశం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో మరో కొత్త వేరియంట్(Corona New Variant In India) విరుచుకుపడనుందా? అంటే.. అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ ఇందోర్లో ఆరుగురికి ఏవై.4 రకం(Ay.4 Variant) కరోనా కొత్త వేరియంట్ సోకినట్లు తేలింది. ఈ మేరకు అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు సోమవారం తెలిపారు.
"దిల్లీకి చెందిన జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం నుంచి వచ్చిన నివేదిక ప్రకారం.. ఆరుగురు వ్యక్తులకు ఏవై.4 రకం కరోనా వైరస్ సోకినట్లు తేలింది. వీరి నమూనాలను జన్యు పరీక్షల కోసం సెప్టెంబరులో దిల్లీకి పంపగా.. ఈ ఫలితాలు వెలువడ్డాయి."
-బీఎస్ సైత్య, ముఖ్య వైద్యాధికారి.
"కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి దేశంలో ఏవై.4 రకం కేసులు(Corona New Variant In India) వెలుగు చూడటం ఇదే తొలిసారి. బాధితులంతా కొవిడ్ టీకా రెండు డోసులను తీసుకున్నప్పటికీ వారికి ఈ రకం(Corona New Variant In India) వైరస్ సోకింది. చికిత్స తర్వాత వారంతా కోలుకున్నారు" అని బీఎస్ సైత్య తెలిపారు. ఈ ఆరుగురు వ్యక్తులతో సన్నిహితంగా ఉన్న 50 మందికి కూడా పరీక్షలు నిర్వహించగా ఆరోగ్యంగా ఉన్నట్లు తేలిందని చెప్పారు.
ఏవై.4 రకం కరోనా వేరియంట్ కొత్తదని ఇందోర్లోని మైక్రోబయాలజీ విభాగానికి చెందిన అధికారి డాక్టర్ అనితా మూతా పేర్కొన్నారు. దీని తీవ్రతపై సమాచారం ఎక్కువగా లేదని చెప్పారు.
మరోవైపు.. మధ్యప్రదేశ్లో ఇప్పటివరకు 1,53,202 మందికి కరోనా సోకినట్లు తేలింది. వైరస్ ధాటికి 1,391 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి: Covid Festive Season: 'పండగలు వస్తున్నాయి.. జాగ్రత్త సుమీ!'
ఇదీ చూడండి: రష్యాలో కరోనా కల్లోలం- 'డెల్టా'ను మించి..