ETV Bharat / bharat

మొక్కేకదా అని పీకేస్తే..  కొట్టి చంపిన మైనర్​ - మొక్క కోసం బాలున్ని చంపిన వ్యక్తి

Madhya Pradesh Crime News: ఈ ఘటన గురించి వింటే  ఇంద్ర సినిమాలో 'మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా..' అన్న చిరంజీవి డైలాగ్ గుర్తుకు రావడం ఖాయం. అవును.. తన పొలంలోని మొక్కను పీకేసినందుకు ఓ బాలుడు మరో బాలుడ్ని చంపేశాడు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది.

Madhya Pradesh Crime News
హత్య
author img

By

Published : Jan 29, 2022, 3:13 PM IST

Madhya Pradesh Crime News: మధ్యప్రదేశ్​లోని బుర్హాన్​పుర్​ జిల్లా షేక్​పుర్​ గ్రామంలో షాకింగ్ ఘటన జరిగింది. తన పొలంలో మొక్కను పీకేశాడన్న క్షణికావేశంలో ఏడేళ్ల బాలుడ్ని చంపేశాడు మరో 12 ఏళ్ల బాలుడు. ఈ ఘటన జనవరి 26న జరిగింది.

నిందితుడు తన వ్యవసాయక్షేత్రాన్ని పర్యవేక్షిస్తుండగా.. అదే గ్రామానికి చెందిన ఏడేళ్ల బాలుడు మొక్కను పీకుతూ కనిపించాడు. దీంతో కోపంతో ఆ బాలుడ్ని కొట్టి వెళ్లిపోయాడు. ఆ దెబ్బలకు బాలుడు స్పృహతప్పి పడిపోయాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి వచ్చి చూడగా సదరు బాలుడు స్పందించలేదు. అతడిని లేపేందుకు నిందితుడు యత్నించగా ఆ బాలుడు ఉలుకూపలుకూ లేదు. దీంతో జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పాడు నిందితుడు. వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోస్ట్​మార్టంలో బాలుడి గుండె ఆగి మృతిచెందినట్లు వైద్యులు నిర్ధరించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: తల్లి వదిలేసినా.. చిట్టి 'సింబా'కు అన్నీ తానై..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.