ETV Bharat / bharat

జీతం రూ.30వేలు.. ఆస్తులు మాత్రం రూ.7కోట్లు.. అవినీతిలో అధికారిణి రికార్డ్! - 30 వేల జీతం 7 కోట్ల ఆస్తులు

ఆమె వయసు 36 ఏళ్లు.. పదేళ్లుగా ప్రభుత్వ శాఖలో ఉద్యోగం.. నెలకు 30వేల రూపాయల జీతం. కానీ ఆమె ఆస్తులు మాత్రం 7కోట్ల రూపాయలకు పైనే ఉన్నాయి. వినడానికి నమ్మశక్యంగా లేదు కదా? ఆమె అవినీతిని చూసి అధికారులే నోరెళ్లబెట్టారు. మధ్యప్రదేశ్‌లో ఓ ప్రభుత్వ అధికారిణి అవినీతికి పరాకాష్ఠగా మారారు.

assistant-engineer-hema-meena-property
assistant-engineer-hema-meena-property
author img

By

Published : May 12, 2023, 8:30 PM IST

మధ్యప్రదేశ్‌లో ఓ ప్రభుత్వ అధికారిణి అవినీతి బాగోతాన్ని అవినీతి నిరోధక అధికారులు బయటపెట్టారు. మధ్యప్రదేశ్‌ రాష్ట్ర పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌లో చిరుద్యోగిగా చేరిన ఆమె.. దశాబ్ద కాలంలోనే కోట్లకు పడగలెత్తారు. భోపాల్‌కు చెందిన హేమా మీనా..2011లో ఒప్పంద ప్రాతిపదికన మధ్యప్రదేశ్‌ పోలీస్ హౌసింగ్‌ కార్పొరేషన్‌ విభాగంలో చేరారు. ప్రస్తుతం ఆమె ఇన్‌ఛార్జ్‌ అసిస్టెంట్‌ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

నెలకు 30 వేల రూపాయల జీతం తీసుకునే మీనా.. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారని లోకయుక్తా అధికారులకు 2020లో ఫిర్యాదు అందింది. దీంతో అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే లోకాయుక్త స్పెషల్‌ పోలీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ విభాగానికి చెందిన బృందం.. గురువారం సాధారణ దుస్తుల్లో మీనా ఇంటికి వెళ్లింది. వాచ్‌మన్‌ వారిని అడ్డుకోగా.. సోలార్‌ ప్యానెల్స్‌ను రిపేర్‌ చేసేందుకు వచ్చామని చెప్పి లోపలికి వెళ్లారు. ఇంట్లోకి వెళ్లగానే మీనాను తమ కస్టడీలోకి తీసుకుని తనిఖీలు చేపట్టగా కళ్లు చెదిరే సంపద బయటపడింది.

ఒక్క రోజు చేసిన తనిఖీల్లోనే అధికారులు.. 7కోట్ల రూపాయల విలువైన ఆస్తుల వివరాలను బయటకు తీశారు. మీనాకు వచ్చే అన్ని రకాల ఆదాయం కంటే ఇది 232 శాతం అధికం కావడం గమనార్హం. ఆమె తొలుత 20 వేల చదరపు అడుగుల వ్యవసాయ భూమిని ఆమె తండ్రి పేరు మీద కొనుగోలు చేసినట్లు ఈ తనిఖీల్లో తేలింది. ఆ తర్వాత ఆ స్థలంలో కోటి రూపాయలతో విలాసవంతమైన విల్లా నిర్మించినట్లు అధికారులు తెలిపారు. పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చేపట్టే ప్రాజెక్టుల కోసం తీసుకొచ్చిన నిర్మాణ సామాగ్రిని కూడా మీనా తన ఇంటి నిర్మాణం కోసం వినియోగించిందని వెల్లడించారు.

assistant-engineer-hema-meena-property
పెంపుడు శునకాలు

100 శునకాలు.. ఓ రోటీ మెషీన్
మీనా ఇంట్లో 20 వాహనాలు ఉండగా.. అందులో 5 నుంచి 7 లగ్జరీ కార్లు ఉండడం చూసి అధికారులు కంగుతిన్నారు. 30 లక్షలు విలువ చేసే 98 అంగుళాల అత్యాధునిక టీవీ సెట్‌, పూర్తి వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌ సిస్టమ్‌, మొబైల్‌ జామర్స్‌ వంటి వస్తువులు ఆమె ఇంట్లో ఉన్నాయని అధికారులు తెలిపారు. అంతేకాకుండా వంద పెంపుడు శునకాలు, 20కి పైగా మేలు జాతి పశువులు, భారీ వ్యవసాయ యంత్రాలు, హార్వెస్టర్లు వంటి వాటిని అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. శునకాలకు రోటీలు తయారు చేసేందుకు ఓ రోటీ యంత్రం సైతం ఉందన్నారు. భోపాల్‌లోని బిల్ఖిరియాలో మీనాకు ఇంటితో పాటు రైసెన్‌, విదిశ జిల్లాల్లోనూ ఆమెకు వ్యవసాయ భూములు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆమె ఆస్తులపై మరిన్ని తనిఖీలు చేయనున్నట్లు పేర్కొన్నారు.

assistant-engineer-hema-meena-property
హేమా మీనా ఇంట్లోని టీవీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.