ETV Bharat / bharat

Madhapur Drug Case Update : 'డ్రగ్స్' వినియోగంపై బేబీ సినిమా నిర్మాతకు నోటీసులు.. స్పందించిన డైరెక్టర్ సాయి రాజేశ్‌ - CP CV Ananda serious on Baby movie

Madhapur Drug Case Update
Hyderabad CP CV Ananda serious on Baby movie
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 14, 2023, 6:24 PM IST

Updated : Sep 14, 2023, 8:56 PM IST

18:20 September 14

Madhapur Drug Case Update : బేబీ సినిమా వాళ్లకు నోటీసులు ఇస్తామన్న సీపీ.. స్పందించిన డైరెక్టర్ సాయి రాజేశ్‌

Madhapur Drug Case Update బేబీ సినిమా వాళ్లకు నోటీసులు ఇస్తాం సీపీ సీవీ ఆనంద్‌

Madhapur Drug Case Update : హైదరాబాద్ మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో మాజీ ఎంపీ విఠల్‌రావు కుమారుడు దేవరకొండ సురేశ్‌రావుతో పాటు ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు హైదరాబాద్ నగర పోలీస్‌ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. వీరి నుంచి నార్కోటిక్ అధికారులు మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుని.. సెల్‌ఫోన్‌లను సీజ్‌ చేశారని సీపీ తెలిపారు. ఈ క్రమంలోనే టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో కొంతమంది బయటకు వస్తున్నారని సీపీ తెలిపారు. ఈ కేసులో సినీనటుడు నవదీప్‌ను వినియోగదారుడిగా గుర్తించామని.. ప్రస్తుతం నవదీప్‌ పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. అదే విధంగా డ్రగ్స్‌ కొనుగోలు చేస్తున్న వారిలో వరంగల్‌కు చెందిన ఓ వ్యక్తి ఉన్నట్లు గుర్తించామన్నారు.

Hyderabad Drugs Case Update : మాదాపూర్ డ్రగ్స్ కేసులో 'వెంకట్​ లీలలు'.. అమ్మాయిలకు సినీ ఎర.. రేవ్ పార్టీల్లో ప్రముఖులకు వల

మాదకద్రవ్యాలు బెంగుళూరు నుంచి వచ్చాయని.. ఆర్గనైజేషన్స్‌ ఏర్పాటు చేసుకుని సోషల్‌ మీడియా ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని సీపీ తెలిపారు. దేశంలో వీసా ముగిసిన అనేక మంది నైజీరియన్లు ఉన్నారన్నారు. బెంగుళూరులో 18 మంది నైజీరియన్లు ఉన్నట్లు గుర్తించామన్నారు.

మాదాపూర్‌ డ్రగ్స్ కేసులో మాజీ ఎంపీ విఠల్‌రావు కూమారుడు సురేశ్‌రావును అరెస్ట్ చేశాం. బేబీ సినిమాలో డ్రగ్స్ వాడుతున్న దృశ్యాలు చూపారు. బేబీ సినిమా వాళ్లకు నోటీసులు ఇస్తాం. డ్రగ్స్ వాడే దృశ్యాలు చూపవద్దని సినీ రంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇకపై ప్రతి సినిమాపై పోలీసుల నిఘా ఉంటుంది.-సీవీ ఆనంద్‌, హైదరాబాద్ సీపీ

మరోవైపు.. బేబీ సినీమాలో డ్రగ్స్‌ ఏ విధంగా వినియోగించాలనే దృశ్యాలను చూపించారని సీపీ సీవీ ఆనంద్ ఆక్షేపించారు. డ్రగ్స్‌ తీసుకునే దృశ్యాలను తీయవద్దని సినిమా రంగానికి సీపీ విజ్ఞప్తి చేశారు. బేబీ సినిమా వాళ్లకు నోటీసులు ఇస్తామని స్పష్టం చేశారు.

Madhapur Drugs Case Update : మాదాపూర్ డ్రగ్స్ వ్యవహారం.. సినీ నిర్మాత, మాజీ నేవీ అధికారి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్

స్పందించిన డైరెక్టర్..: బేబీ సినిమాలో కథలో భాగంగా డ్రగ్స్‌ సన్నివేశం పెట్టాల్సి వచ్చిందని ఆ సినిమా డైరెక్టర్ సాయి రాజేశ్‌ వివరణ ఇచ్చారు. బేబీ సినిమాలో డ్రగ్స్ సన్నివేశాలకు సంబంధించిన దృశ్యాలు ఉండటంతో పోలీసులు పిలిచి వివరణ అడిగారని తెలిపారు. అలాంటి సన్నివేశాలు మాదాపూర్ డ్రగ్స్‌ కేసులో ఆనవాళ్లు బయటకు వచ్చాయని పోలీసులు చెప్పినట్లు సాయి రాజేశ్‌ వివరించారు. ప్రజలకు ఆదర్శంగా ఉండేలా సినిమాలు తీయాలని.. తెలుగు సినీ పరిశ్రమ రంగానికి తెలపాలని పోలీసులు కోరినట్లు చెప్పారు. ఈరోజు అడ్వైజరీ నోటీసు కూడా తనకు ఇచ్చారని స్పష్టం చేశారు.

బేబీ సినిమాపై పోలీసులు అడ్వైజరీ నోటీస్ ఇచ్చారు. బేబీ సినిమాలో ఒక సన్నివేశం గురించి ఆరా తీశారు. డ్రగ్స్ సన్నివేశాలపై వివరణ అడిగారు. కథలో భాగంగా పెట్టాల్సి వచ్చిందని చెప్పాం. ప్రజలకు ఆదర్శంగా ఉండేలా సినిమాలు తీయాలని కోరారు. - సాయి రాజేశ్‌, బేబీ చిత్ర దర్శకుడు

Hyderabad Drugs Case Update : మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో కొత్త కోణం.. 18 మంది డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు గుర్తింపు

Last Updated : Sep 14, 2023, 8:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.