ETV Bharat / bharat

'హాలీవుడ్​' స్టైల్లో లగ్జరీ కార్లు చోరీ.. ఒక్కనెల్లోనే 40.. ఎలా దొరికారంటే? - delhi crime news

Luxury Car Theft News: 40కి పైగా లగ్జరీ కార్ల దొంగతనానికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు దిల్లీ పోలీసులు. అయితే ఈ దొంగలు చోరీల కోసం స్కానర్లు, జీపీఎస్​ జామర్లు సహా హైటెక్ టూల్స్​ వాడినట్లు తెలుస్తోంది.

Luxury Car Theft News
delhi car theft news
author img

By

Published : May 28, 2022, 7:15 AM IST

Luxury Car Theft News: హాలీవుడ్​ చిత్రం 'ఫాస్ట్​ అండ్ ఫ్యూరియస్'​ స్ఫూర్తిగా లగ్జరీ కార్ల దొంగతనాలకు పాల్పడ్డారు ముగ్గురు వ్యక్తులు. ఇలా ఒక్కనెలలో ఏకంగా 40కుపైగా లగ్జరీ కార్లను కొట్టేశారు. అందుకోసం స్కానర్లు, జీపీఎస్ జామర్ సహా హైటెక్​ పరికరాలను వాడారు. శుక్రవారం నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.. ఈ విషయాలను వెల్లడించారు.

నిందితులను మనీశ్ రావు, జగ్​దీప్ శర్మ, ఆస్ మహమ్మద్​లుగా పోలీసులు గుర్తించారు. వీరిలో మనీశ్​ రావు, జగ్​దీప్​ శర్మ దిల్లీలోని ఉత్తమ్​నగర్​కు చెందిన వారు కాగా ఆస్​ మహమ్మద్​.. యూపీలోని మేరఠ్​కు చెందిన వ్యక్తని వెల్లడించారు. పశ్చిమ్ విహార్​ ప్రాంతం నుంచి దొంగిలించిన కారును రావు, శర్మ.. విక్రయానికి తీసుకొచ్చినప్పుడు వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అపహరణకు గురైన వాహనంలో చేసిన సోదాల్లో సెన్సార్​ కిట్, మాగ్నెట్, ఎల్​ఎన్​టీ తాళాలు, 8 రిమోట్ కార్ తాళాలను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు రెండు తుపాకులు, టూల్​కిట్స్​, హ్యాకింగ్​ డివైజ్, ఏడు కార్లు సహా 30 కార్లకు చెందిన తాళాలు నిందితుల వద్ద లభ్యమయ్యాయి.

ఇదీ చూడండి: నదిలో ఖరీదైన 'బీఎండబ్ల్యూ' కారు.. కారణం తెలిసి పోలీసులు షాక్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.