ETV Bharat / bharat

ఆ రికార్డులు నాశనం చేసేందుకే.. కోర్టులో బాంబు దాడి! - లుథియానా కోర్టులో బాంబు దాడి

Ludhiana court blast: తనపై నమోదైన డ్రగ్స్​ కేసుకు సంబంధించిన రికార్డులను నాశనం చేసేందుకే పంజాబ్​లోని లుథియానా జిల్లా కోర్టులో మాజీ కానిస్టేబుల్​ బాంబు దాడికి పాల్పడినట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. బాంబును బిగించి మరోచోట దానిని అమర్చేందుకే వాష్​రూమ్​లోకి వెళ్లాడని, బాంబు తీగలు కలుపుతున్నప్పుడే పేలిపోయినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పంజాబ్​ డీజీపీ తెలిపారు.

ludhiana-court-blast
కోర్టులో బాంబు దాడి
author img

By

Published : Dec 25, 2021, 3:46 PM IST

Ludhiana court blast: పంజాబ్​లోని లుథియానా జిల్లా కోర్టులో జరిగిన బాంబు పేలుడు ఘటనలో సంచనల విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిని.. 2019లో ఓ డ్రగ్స్​ కేసుకు సంబంధించి డిస్మస్​ అయిన హెడ్​ కానిస్టేబుల్​ గగన్​దీప్​ సింగ్​గా గుర్తించారు పోలీసులు. ఘటనాస్థలంలో మొబైల్​ సిమ్​కార్డు, వైర్​లెస్​ డాంగిల్​ను స్వాధీనం చేసుకుని, సిమ్​ ఆధారంగా గగన్​దీప్​ను గుర్తించారు. అయితే, తనపై నమోదైన డ్రగ్స్​ కేసులో రికార్డులను నాశనం చేసేందుకే గగన్​దీప్​ ఈ పేలుడుకు పాల్పడినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

లుథియానాలోని ఖన్నా ప్రాంతానికి చెందిన గగన్​దీప్​ను మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో 2019లో విధుల నుంచి తొలగించారు. ఆ తర్వాత పోలీసులు అతడిని అరెస్ట్​ చేశారు. రెండేళ్ల పాటు జైల్లో ఉన్న గగన్​దీప్​.. ఈ ఏడాది సెప్టెంబర్​లో బెయిల్​పై విడుదలయ్యాడు. కేసు విచారణలో భాగంగా కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. ఈ క్రమంలోనే కేసు నుంచి బయటపడేందుకు ఈ కుట్ర పన్నినట్లు అధికార వర్గాలు భావిస్తున్నాయి. కేసుకు సంబంధించిన పేపర్లను భద్రపరిచే కోర్టు రికార్డు గదిని బాంబుతో పేల్చేయాలని ప్రణాళిక చేసుకున్న గగన్​దీప్​.. మూత్రశాలలో బాంబును అమర్చుతుండగా ఒక్కసారిగా పేలిపోయింది.

దాడి వెనక వారి హస్తం..

లుథియానా కోర్టు పేలుడు ప్రాథమిక విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు చెప్పారు పంజాబ్​ డీజీపీ సిద్ధార్థ్​ ఛటోపాధ్యాయ. బాంబును బిగించి మరో ప్రాంతంలో అమర్చేందుకే వాష్​రూమ్​లోకి మాజీ హెడ్​ కానిస్టేబుల్ వెళ్లినట్లు తెలిసిందన్నారు. బాంబు పేలిపోయినప్పుడు గగన్​దీప్​ ఒక్కడే మూత్రశాలలో ఉన్నాడని తెలిపారు. దీనితో ఖలిస్థానీ ఉగ్రవాదులు, డ్రగ్స్ స్మగ్లర్లు, మాఫియాకు సంబంధాలు ఉన్నాయని భావిస్తున్నట్లు చెప్పారు.

" పేలుడుకు వాడిన పదార్థాలను తెలుసుకునేందుకు ఫోరెన్సిక్​ ల్యాబ్​కి నమూనాలు పంపించాం. నివేదిక తర్వాతే ఆర్​డీఎక్స్​ వాడారా లేదా అనేది తెలుస్తుంది. ఇప్పుడు దానిపై స్పష్టత ఇవ్వలేము. గగన్​దీప్​ విధుల్లో ఉన్నప్పుడు సాంకేతికంగా నైపుణ్యం ఉంది. కంప్యూటర్లు, సాంకేతిక పరికరాలను నిర్వహించటంలో మంచి పనితీరు కనబరిచాడు. ఈ ఘటనను మానవ బాంబుగా పరిగణించలేం. కొన్ని తీగలను కలిపి.. వేరే చోట బాంబును పెట్టాలనే ఉద్దేశంతోనే అతను వాష్​రూమ్​కి వెళ్లినట్లు తెలుస్తోంది. అతను కాలకృత్యాల కోసం మూత్రశాలను వినియోగించుకోలేదు, బాంబును బిగించేందుకు వాష్​రూమ్​ను వినియోగించుకున్నాడు. "

- ​ సిద్ధార్థ్​ ఛటోపాధ్యాయ, పంజాబ్​ డీజీపీ

పేలుడులో మృతి చెందిన వ్యక్తిని కేవలం 24 గంటల్లోనే గుర్తించిన పోలీసులను, ఇతర దర్యాప్తు సంస్థల పనితీరును కొనియాడారు డీజీపీ. గగన్​దీప్​ను గుర్తించటంలో మొబైల్​ సిమ్​ కార్డు సాయపడినట్లు తెలిసిందన్నారు. పంజాబ్​ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కొన్ని బయటి శక్తులు రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నాయని, వారిని విజయవంతం కాబోనివ్వమని, ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. రాష్ట్రంలో నార్కో టెర్రరిసమ్​ పెరిగిపోయిందని, ఈ బ్లాస్ట్​ వెనక వారి హస్తం ఉందన్నారు. పంజాబ్​ పోలీసులు, ముఖ్యంగా ఎస్​టీఎఫ్​ బృందాలు వారిని కట్టడి చేయాలన్నారు.

ఇదీ చూడండి: Ludhiana Bomb Blast: లుథియానా బాంబు పేలుళ్ల మృతుడు.. మాజీ పోలీసు

కోర్టులో భారీ పేలుడు.. ఒకరు మృతి.. వారి పనేనన్న సీఎం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.