ETV Bharat / bharat

లుథియానా కోర్టు పేలుడు కేసు- జర్మనీలో నిందితుడు అరెస్ట్

Ludhiana Court Blast: లుథియానా కోర్టు పేలుడు కేసులో నిందితుడిగా భావిస్తున్న జస్వీందర్​ సింగ్​ను జర్మనీ అధికారులు అరెస్ట్ చేశారు. జస్వీందర్​పై ఇప్పటికే పంజాబ్​లో రెండు ఎఫ్​ఐఆర్​లు నమోదయ్యాయి.

author img

By

Published : Dec 29, 2021, 4:09 AM IST

Updated : Dec 29, 2021, 7:08 AM IST

jashwinder
లుథియానా కోర్టు పేలుడు కేసు

Ludhiana Court Blast: పంజాబ్​లోని లుథియానా కోర్టు వద్ద ఇటీవల జరిగిన పేలుడుకు సంబంధించి ఓ వ్యక్తిని అరెస్ట్​ చేశారు జర్మనీ పోలీసులు. నిందితుడు సిఖ్​ ఫర్​ జస్టిస్​కు​ (ఎస్​ఎఫ్​జే) చెందిన జస్వీందర్​ సింగ్​ ముల్తానీగా గుర్తించారు అధికారులు. నిఘా వర్గాల సమాచారం మేరకు నిందితుడిని అరెస్ట్​ చేసినట్లు అధికారులు మంగళవారం వెల్లడించారు. జస్వీందర్​కు కోర్టు పేలుడుతో సంబంధం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి పేలుడులో మృతిచెందిన నిందితుడు గగన్​దీప్​ వద్ద ఆధారాలు లభించాయని పేర్కొన్నారు.

జస్వీందర్​పై ఇప్పటికే పంజాబ్​లో రెండు ఎఫ్​ఐఆర్​లు నమోదయ్యాయి. భారత అధికారుల సమాచారం ఆధారంగా జర్మన్​ అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. ఈ పేలుడుకు ఖలీస్థానీ ఉగ్రవాదులకు సంబంధంపై ప్రధానంగా దర్యాప్తు చేస్తున్నారు అధికారులు.

Jaswinder Singh Multan

కోర్టు పేలుడులో మృతిచెందిన గగన్​దీప్​.. తరచూ జస్వీందర్​తో సంప్రదింపులు జరిపేవాడని నిఘావర్గాల సమాచారం. పేలుడుకు తగిన ఏర్పాట్లు చేయడంలో జస్వీందర్​ కీలక పాత్ర పోషించాడని అధికారులు వెల్లడించారు. సోషల్​ మీడియా ద్వారా వీరి మధ్య జరిగిన సంభాషణలో పంజాబ్​ సహా మరిన్ని ప్రాంతాల్లో పేలుడు ప్రయత్నిస్తున్నట్లు సూచనలు అందాయని తెలిపారు.

ఈ ఏడాదిలో జస్వీందర్​పై ఆరోపణలు రావడం ఇది రెండోసారి. ఇదివరకు సాగుచట్టాలపై నిరసనల్లో రైతు నేతల హత్యకు జరిగిన కుట్ర వెనుక కూడా జస్వీందర్​ సింగ్​ హస్తం ఉన్నట్లు దర్యాప్తులో తేలింది.

ఇదీ చూడండి : తల్లిపై అత్యాచారయత్నం.. మామను గొడ్డలితో నరికి చంపిన బాలికలు!

Last Updated : Dec 29, 2021, 7:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.