ETV Bharat / bharat

'ధర్మెగౌడ ఆత్మహత్యపై ఉన్నత స్థాయి విచారణ' - karnataka legislative council

కర్ణాటక శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్​ ధర్మెగౌడ ఆత్మహత్య కేసుపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరపాలని లోక్​సభ​ స్పీకర్​ ఓం బిర్లా అన్నారు. స్వతంత్ర సంస్థతో విచారణ చేపట్టాలని తెలిపారు. ధర్మెగౌడ మృతి తనను ఎంతో బాధించిందని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు.

LS Speaker calls for high-level probe in S L Dharme Gowda suicide case
ధర్మెగౌడ ఆత్మహత్యపై ఉన్నత స్థాయి విచారణ: ఓం బిర్లా
author img

By

Published : Dec 30, 2020, 4:26 PM IST

కర్ణాటక శాసస మండలి డిప్యూటీ స్పీకర్ ధర్మెగౌడ ఆత్మహత్య కేసుపై స్వతంత్ర సంస్థతో ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించాలని లోక్​సభ స్పీకర్​ ఓంబిర్లా అన్నారు. ఆయన మృతి తనను కలచివేసిందని చెప్పారు. కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.

ధర్మెగౌడ సభలో కూర్చుకున్నప్పుడు జరిగిన ఘటనలు దురదృష్టకరమన్నారు బిర్లా. ఆయనపై దాడిని ప్రజాస్వామ్యంపై జరిగిన తీవ్రదాడిగా పేర్కొన్నారు. ధర్మెగౌడ మృతిపై ఉన్నత స్థాయి విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు.

శాసనసభల ప్రతిష్ఠ , ప్రిసైడింగ్ అధికారుల స్వేచ్ఛ, గౌరవాలను కాపాడటం మనందరి కర్తవ్యం అవి బిర్లా అన్నారు.

ఆత్మహత్య లేఖ..

ధర్మెగౌడ ఆత్యహత్యకు సంబంధించిన లేఖను చిక్కమగళూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు కర్ణాటక సీఎం యడియూరప్ప తెలిపారు. లేఖ చాల పెద్దగా ఉందని, అందులో అయన ఆస్తుల వివరాలు, ఇతర వ్యక్తిగత వివరాలు ఉన్నాయని చెప్పారు. అందుకే ఆ విషయాలను వెల్లడించడం లేదన్నారు.

ఇదీ చూడండి: కర్ణాటక మండలి ఉపసభాపతి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.