ETV Bharat / bharat

LPU Chancellor Met Modi : కుటుంబ సమేతంగా ప్రధాని మోదీని కలిసిన LPU ఛాన్స్​లర్.. విద్యా రంగంపై కీలక చర్చలు! - ashok mittal mp rajya sabha met modi

LPU Chancellor Met Modi : ప్రఖ్యాత లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఛాన్స్​లర్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ అశోక్ కుమార్ మిత్తల్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కుటుంబ సమేతంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ఇరువురూ చర్చించుకున్నారు. విద్యా రంగానికి మోదీ చేస్తున్న కృషిని ప్రస్తావిస్తూ అభినందనలు తెలియజేశారు డాక్టర్ మిత్తల్.

LPU Chancellor Met Modi
ప్రధానితో ఆప్​ ఎంపీ భేటీ
author img

By

Published : Aug 9, 2023, 10:43 PM IST

LPU Chancellor Met Modi : లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఛాన్స్​లర్, రాజ్యసభ ఎంపీ డాక్టర్ అశోక్ కుమార్ మిత్తల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. కుటుంబ సభ్యులతో కలిసి మోదీతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ మిత్తల్.. మోదీ ఎల్​పీయూ పర్యటన గురించి ప్రస్తావించారు. 2019లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్​ సమావేశాల సందర్భంగా మోదీ ఎల్​పీయూకు వచ్చినట్లు గుర్తు చేశారు. ఈ సమావేశంలోనే శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ 'జై అనుసంధాన్' నినాదాన్ని ఇచ్చారని తెలిపారు.

మోదీతో సమావేశంలో భాగంగా ఉన్నత విద్యలో పరిశోధనలు, ఆవిష్కరణల ఆవశ్యకత గురించి డాక్టర్ మిత్తల్ తన అభిప్రాయాలు వెల్లడించారు. పరిశ్రమ వర్గాలు, విద్యా సంస్థల మధ్య అనుసంధానాన్ని మరింత బలోపేతం చేయాలని డాక్టర్ మిత్తల్ పేర్కొన్నారు. ఆర్థిక పురోగమనానికి, అభివృద్ధికి ఇది దోహదం చేస్తుందని తెలిపారు. తమ యూనివర్సిటీ విద్యార్థులకు నిజజీవితానికి అవసరమయ్యే విద్యను అందించడమే కాకుండా మెరుగైన శిక్షణ ఇస్తూ జాతీయ నైపుణ్యాభివృద్ధి మిషన్ విజయానికి తమవంతు ప్రోత్సాహం కల్పిస్తున్నట్లు చెప్పారు.

విద్యారంగానికి ప్రధాని నరేంద్ర మోదీ అందిస్తున్న మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. నూతన విద్యావిధానం తీసుకొచ్చేందుకు చొరవ చూపినందుకు అభినందనలు తెలిపారు. నూతన విద్యా విధానం అమలుకు సంబంధించి ఎల్​పీయూకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి బాధ్యతలు అప్పగించినా.. నెరవేర్చేందుకు సిద్ధంగా ఉంటామని డాక్టర్ మిత్తల్ ప్రధాని మోదీతో పేర్కొన్నారు.

LPU Chancellor Met Modi
ప్రధానితో ఎల్​పీయూ ఛాన్స్​లర్ డాక్టర్ అశోక్ కుమార్ మిత్తల్, ఆయన భార్య రష్మీ మిత్తల్

కాగా, డాక్టర్ మిత్తల్ భార్య రష్మీ మిత్తల్.. ప్రధానికి ఓ పుష్పగుచ్ఛంతో పాటు పంజాబీ చేనేత శాలువా (ఫుల్కారి)ని అందజేశారు. మోదీ తన తల్లితో కలిసి ఉన్న ఫొటో ఫ్రేమ్​ను.. మిత్తల్ కుమార్తె సృష్టి, అల్లుడు శ్రేష్ఠ ఖేతన్ ప్రధానికి అందించారు. ఎల్​పీయూ విద్యార్థి వేసిన మోదీ పెయింటింగ్ చిత్రాన్ని మిత్తల్ తన కుమారుడు ప్రథమ్ మిత్తల్​తో కలిసి ప్రధానికి బహూకరించారు. శ్రేష్ఠ ఖేతన్ ముత్తాత మురళీధరన్ ఖేతన్ రాసిన పుస్తకంపై మోదీ సంతకం చేశారు.

ప్రధాని మోదీ సైతం మిత్తల్ కుటుంబ సభ్యులతో గణనీయమైన సమయం గడిపారు. విద్యాపరమైన అంశాలతో పాటు అభివృద్ధికి సంబంధించిన విషయాలపై వారితో చర్చించారు. డాక్టర్ మిత్తల్ ఆలోచనలను అభినందించారు. విద్యా రంగంలో సంస్కరణల విషయానికి తాను గట్టిగా మద్దతు ఇస్తానని మోదీ చెప్పారు. అభివృద్ధికి శాస్త్ర, సాంకేతికతలు అత్యంత కీలకమన్న విషయాన్ని తాము గుర్తిస్తున్నట్లు వివరించారు. 'జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్​' నినాదానికి 'జై అనుసంధాన్' అనే పదాన్ని ఎందుకు జోడించామనే విషయాన్ని మోదీ వెల్లడించారు. వైద్యం, వ్యవసాయం, రక్షణ సహా వివిధ రంగాల పురోగతికి శాస్త్ర-సాంకేతికల ఆవశ్యకతను నొక్కి చెప్పడానికే ఈ నినాదం ఇచ్చినట్లు మోదీ వివరించారు.

నేడు ప్రధానితో తెలంగాణ భాజపా ఎంపీల భేటీ

వెంకయ్యనాయుడుతో ప్రధాని మోదీ సమావేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.