ETV Bharat / bharat

తుపాకీ తూటాలకు బలైన ప్రేమికులు - షాహ్​జహాపుర్ న్యూస్ టుడే

పెళ్లైన ఓ వ్యక్తి.. యువతి ఆరేళ్లుగా ప్రేమ బంధాన్ని కొనసాగిస్తున్నారు. ఈ విషయం తెలిసి యువతి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఇరువురినీ తుపాకీతో కాల్చి దారుణ హత్యకు ఒడిగట్టారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో(Shahjahanpur News) జరిగింది.

Uttar Pradesh
ప్రేమ జంట
author img

By

Published : Sep 17, 2021, 8:46 PM IST

Updated : Sep 18, 2021, 7:14 AM IST

అప్పటికే వివాహమైన ఓ వ్యక్తి మరో యువతితో ఆరేళ్లుగా ప్రేమాయణం సాగించాడు. తీరా యువతికి మరో వ్యక్తితో పెళ్లి కుదిరాక.. ఇరువురి ప్రేమ విషయం బయటపడింది. దీంతో ఆగ్రహానికి గురైన యువతి కుటుంబ సభ్యులు వారిద్దరిని దారుణంగా కాల్చి చంపేశారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో షాహ్​జహాన్​పుర్​ (Shahjahanpur News) జరిగింది.

ఇదీ జరిగింది..

జిల్లాకు(Shahjahanpur News Today) చెందిన ఆశిష్​ కుమార్(25), బంటి(21) ఆరేళ్లుగా ప్రేమాయణం సాగిస్తున్నారు. ఆశిష్​కు అప్పటికే ఓ మహిళతో వివాహం జరగ్గా.. రెండు వారాల క్రితమే అతడు ఓ బిడ్డకు తండ్రయ్యాడు. మరోవైపు బంటికి ఇటీవలే తన కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధం చూశారు. నవంబర్​లో వివాహం కూడా జరుపుదామని నిర్ణయించుకున్నారు.

ఈ క్రమంలో యువతి కుటుంబ సభ్యులకు.. ఆశిష్-బంటి ప్రేమాయణం గురించి తెలిసింది. ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయిన బంటి కుటుంబ సభ్యులు.. ఇరువురినీ తూపాకీతో కాల్చి చంపేశారని జిల్లా ఎస్పీ ఎస్​ ఆనంద్ వెల్లడించారు.

"నౌగావా నరోత్తమ్​ గ్రామంలో ఈ ఘటన జరిగింది. యువతిని తన ఇంటి మొదటి అంతస్తులోనే తుపాకీతో కాల్చి హత్య చేశారు. యువకుడి మృతదేహాన్ని బాధిత యువతి ఇంటికి 150 మీటర్ల దూరంలోని ఓ చెట్టు వద్ద వదిలేశారు."

--ఎస్ ఆనంద్, జిల్లా ఎస్పీ.

యువతి శరీరంలో ఓ తూటా దిగినట్లు ఆనంద్​ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. యువతి కుటుంబ సభ్యులు కొందరు పారిపోయినట్లు తెలిసిందన్నారు. బంటి కుటుంబంలోని ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నట్లు స్పష్టం చేశారు. హత్యకు ఉపయోగించిన తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:Rape statistics in India: అత్యాచారాలు, హత్యలు రాజధానిలోనే ఎక్కువ!

Last Updated : Sep 18, 2021, 7:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.