ETV Bharat / bharat

నల్గొండ జిల్లాలో విషాదం - రైలు కిందపడి యువతీయువకుడి బలవన్మరణం - నల్గొండలో ప్రేమజంట సూసైడ్

A young Woman and a Young Man Commit Suicide in Nalgonda District : రైలు కిందపడి ఓ యువతి, యువకుడు బలవన్మరణానికి పాల్పడారు. ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. దీనిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

Lovers Commit Suicide
Lovers Commit Suicide
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 31, 2023, 9:46 AM IST

Updated : Dec 31, 2023, 12:28 PM IST

A young Woman and a Young Man Commit Suicide in Nalgonda District : నేటి కాలంలో చిన్నపాటి కారణాలతో, క్షణికావేశంలో చాలా మంది బలవన్మరణాలకు (Commit Suicide) పాల్పడుతున్నారు. చిన్న అపజయాన్నీ తట్టుకోలేకపోతున్నారు. ప్రేమ విఫలమైందని ఒకరు, పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయని మరొకరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆర్థిక ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు వచ్చాయని, కుటుంబంలో సమస్యలను తట్టుకోలేక చాలా మంది ప్రాణాలు తీసుకుంటున్నారు. కారణం ఏదైనా విలువైన జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. ఫలితంగా అనాలోచితంగా తీసుకున్న నిర్ణయాలతో తమను నమ్ముకున్న వారిని విషాదంలోకి నెట్టేస్తున్నారు.

Wife And Husband Suicide In Medak : కుటుంబ కలహాలతో భార్య.. కాపాడపోయి భర్త..

రైలు కింద పడి ఓ యువతీ, యువకుడు ఆత్మహత్య : తాజాగా నల్గొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మిర్యాలగూడ వద్ద రైలు కింద పడి ఓ యువతి, యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మరణించిన యువకుడి చేతిపై రామలక్ష్మ అనే పచ్చబొట్టు ఉందని రైల్వే పోలీసులు తెలిపారు. మృతుల వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని వారు చెప్పారు.

భార్య, ఇద్దరు పిల్లలను తుపాకీతో కాల్చి చంపి - కలెక్టర్‌ గన్‌మెన్‌ ఆత్మహత్య

ఘటనా స్థలం నుంచి ఓ సెల్​ఫోన్ స్వాధీనం చేసుకున్నామని రైల్వే పోలీసులు తెలిపారు. అందులో సిమ్ ​కార్డు లేకపోవడంతో మృతుల వివరాలు తెలియలేదని పేర్కొన్నారు. మృతదేహాలను పోస్ట్​మార్టం నిమిత్తం మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని చెప్పారు. మృతులు భార్యాభర్తలా లేక ప్రేమికులా అనే కోణంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు.

"ఈరోజు ఉదయం పట్టాలపై రెండు మృతదేహాలు ఉన్నాయని సమాచారం వచ్చింది. ఇక్కడికి వచ్చి పరిశీలించగా, మృతదేహాలు కనిపించాయి. ఘటనా స్థలంలో ఒక సెల్​ఫోన్ దొరికింది. అందులో సిమ్​ కార్డు లేకపోవడంతో వారి వివరాలు తెలియలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం." - రైల్వే పోలీసులు

Suicides in Telangana 2023 : ఇలా వివిధ కారణాలతో దేశంలో ప్రతి 40 సెకన్లకు ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 15 నుంచి 29 ఏళ్ల మధ్య ఉన్న వారు చనిపోతున్న కారణాల్లో అధికంగా ఆత్మహత్యలే ఉంటున్నాయి. ఆత్మహత్యలకు ముఖ్యంగా సైకలాజికల్ ఫ్యాక్టర్, బయో ఫ్యాక్టర్, సోషల్ ఫ్యాక్టర్‌ కారణాలుగా ఉంటాయని వైద్యులు అంటున్నారు. సమస్యను తీర్చుకోలేక అన్ని దారులు మూసుకుపోయాయనే అపోహలో ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.

పెళ్లైన వ్యక్తితో యువతి ప్రేమాయణం.. ఒకరినొకరు విడిచి ఉండలేక ఆత్మహత్య

విషాదం... ఇద్దరు పిల్లలతో సహా దంపతుల ఆత్మహత్య

Last Updated : Dec 31, 2023, 12:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.