ETV Bharat / bharat

లవ్ జిహాద్ కేసు.. వితంతువుపై అత్యాచారం.. మాంత్రికురాలని ఆరోపించి సజీవదహనం - పాఠశాల విద్యార్థులపై లైంగిక దాడి

మధ్యప్రదేశ్​లో లవ్​జిహాద్ కేసు వెలుగుచూసింది. ఓ వితంతువుపై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. అనంతరం ఆమెను బలవంతంగా మతం మార్చేందుకు ప్రయత్నించాడు. మరోవైపు, క్షుద్ర పూజలు చేసి ఓ వ్యక్తిని చంపేసిందని.. ఓ మహిళను సజీవదహనం చేసిన ఘటన బిహార్​లో జరిగింది.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Nov 5, 2022, 10:39 PM IST

మధ్యప్రదేశ్​లోని ఇందోర్​లో లవ్​జిహాద్​ కేసు వెలుగుచూసింది. మహ్మద్‌ షాకీర్‌ అనే వ్యక్తి.. పంజాబీ వితంతువుపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అక్కడితో ఆగకుండా ఆమెను మతమార్పిడి చేసుకోమని బలవంతం చేశాడు. ఈ ఘటనపై ఎఫ్​ఐఆర్ నమోదు చేయకపోవడంపై విజయనగర్ పోలీసులను ఇందోర్​ హైకోర్టు మందలించింది. బాధితురాలి ఫిర్యాదు చేసినప్పటికీ నిందితుడిపై ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలి భర్త కొన్నాళ్ల క్రితం మరణించాడు. ఈ క్రమంలో ఆమెకు నిందితుడు మహ్మద్ షాకీర్ బ్యాంకు రుణం ఇప్పిస్తానని పరిచయం పెంచుకున్నాడు. అనంతరం ఆమెతో చనువు పెంచుకుని స్నేహితుడిగా మారాడు. కొద్ది రోజుల క్రితం మత్తు మందు కలిపిన ఆహారం ఇచ్చి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం నిందితుడు ఆ దారుణాన్ని వీడియో తీసి.. ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల తర్వాత నిందితుడు ఓ వర్గానికి చెందిన వ్యక్తి అని.. అతడికి 9 మంది పిల్లలు ఉన్నారని బాధితురాలికి తెలిసింది.

మంత్రగత్తె అని..
బిహార్ గయాలోని దారుణం జరిగింది. మాంత్రికురాలు అనే అనుమానంతో ఓ మహిళపై దాడి చేసి అనంతరం సజీవ దహనం చేశారు గ్రామస్థులు. ఆమె ఇంటిని సైతం తగులబెట్టారు. సమాచారం అందుకుని ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులపైనా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో పలువురు పోలీసులు గాయపడ్డారు. ఇమామ్​గంజ్ పోలీస్ స్టేషన్​ పరిధిలో జరిగిందీ ఘటన.

గ్రామానికి చెందిన పరమేశ్వర్ భారతి అనే యువకుడు ఇటీవల ప్రాణాలు కోల్పోయాడు. హేమంతి దేవి అనే క్షుద్రపూజలు చేయడమే అతని మృతికి కారణమని భావించి బాధితురాలిని సజీవ దహనం చేశారు గ్రామస్థులు. పోలీసులు బాధితురాలి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు కారణమైన నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు.

విద్యార్థినిలపై టీచర్​..
మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని ఓ మిషనరీ పాఠశాలలో దారుణం జరిగింది. పాఠశాల బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు ఓ ఉపాధ్యాయుడు. ఈ క్రమంలో విద్యార్థినిల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పాఠశారకు చేరుకుని ఆందోళన చేశారు. పాఠశాలను మూసివేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బాలికల తల్లిదండ్రులను శాంతింపజేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

పాఠశాల బాత్​రూమ్​లో..
పంజాబ్​ లుధియానాలోని దారుణం జరిగింది. సానెట్‌లోని ప్రభుత్వ పాఠశాలలోని బాత్‌రూమ్‌లో ఓ చిన్నారి అపస్మారక స్థితిలో కనిపించడం కలకలం రేపింది. తమ బిడ్డను హత్య చేసేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తూ చిన్నారి తల్లిదండ్రులు పాఠశాల వద్ద ఆందోళన చేశారు. అలాగే తమ బిడ్డ మెడపై తాడు గుర్తులు ఉన్నాయని ఆరోపించారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని అన్నారు. అయితే ఈ ఘటనపై పాఠశాల ప్రిన్సిపల్ స్పందించారు. ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగి ఉంటుందని ఆయన తెలిపారు.

ఇవీ చదవండి: ఆన్​లైన్ స్నేక్ క్యాచర్స్.. ఫొటో తీసి పంపిస్తే పాముల్ని పట్టుకెళ్తారు!

గుజరాత్ పీఠం భాజపాదే.. రెండో స్థానంలో ఆప్​.. ఆసక్తికరంగా ప్రీ-పోల్ సర్వే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.