ETV Bharat / bharat

ఇద్దరు దొంగల లవ్​స్టోరీ- జల్సాల కోసం విలువైన వస్తువుల చోరీ - ఇంటి అద్దెకోసం వచ్చి దొంగతనాలు

జల్సాలకు అలవాటు పడి తరచూ దొంగతనాలకు పాల్పడుతున్న ఓ ప్రేమ జంటను అరెస్టు చేశారు పోలీసులు. ఇల్లు అద్దెకు కావాలని వస్తూ ఈ జంట చోరీలకు పాల్పడేదని.. దొంగిలించిన సొత్తును విలాసవంతంగా జీవించేందుకు ఖర్చు చేసేవారని వెల్లడించారు.

Love birds
Love birds
author img

By

Published : Oct 9, 2021, 10:29 AM IST

Updated : Oct 9, 2021, 12:14 PM IST

జల్సాలకు అలవాటుపడి దొంగతనాలు చేస్తున్న లవర్స్

విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన ఓ ప్రేమజంట.. చోరీల బాటపట్టింది. ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చే వీరు.. యాజమానుల దృష్టిని మరల్చి.. ఆ ఇంట్లోని వస్తువులను దొంగిలించేవారు. కర్ణాటక బెంగళూరులో గతకొంత కాలంగా జరుగుతున్న ఈ తరహా దొంగతనాల కేసును పోలీసులు ఛేదించారు.

Love birds
కీర్తన-వినయ్

ఇదీ వీరి కథ..

అద్దెకు ఇల్లు కావాలని వస్తూ చోరీలు చేసే ప్రేమజంటను వినయ్, కీర్తనగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరికీ మూడేళ్ల క్రితం పరిచయమైంది. వినయ్​పై ఇప్పటికే రౌడీషీట్ ఉందని, ఓ హత్య సహా.. పలు క్రిమినల్ కేసుల్లో అతను నిందితుడని తెలిపారు. అయితే వినయ్ రౌడీషీటర్ అని తెలిసినప్పటికీ.. అతడిని ప్రేమిస్తున్నట్లు పోలీసులకు వెల్లడించింది కీర్తన. అతని కోసం ఏమైనా చేస్తానని.. జైలుకు కూడా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని చెబుతోంది.

Love birds
సీసీ కెమెరాల్లో నిందితురాలు కీర్తన

ప్రస్తుతం వినయ్-కీర్తనలు ప్రేమలో ఉన్నారని.. తనను లాంగ్​డ్రైవ్‌కు తీసుకెళ్లాలని, ఖరీదైన బహుమతులు ఇవ్వాలని కీర్తన వినయ్​ని ఒత్తిడి చేసేదని పోలీసుల విచారణలో వెల్లడైంది. అందుకే దొంగతనాలు చేసేవాడని .. వీటికోసం ఆమెనూ తీసుకువెళ్లేవాడని తేలింది.

దొరికారిలా..

ఈ క్రమంలోనే అక్టోబర్ 4న మారుతీనగర్‌లోని ఓ ఇంటికి వెళ్లిన ఈ జంట.. ప్రైవేట్ కంపెనీ ఉద్యోగులుగా పరిచయం చేసుకొని ఇల్లు అద్దెకు కావాలని నాటకం ఆడారు. అనంతరం యజమాని దృష్టిని మరల్చి ఒక మొబైల్​ఫోన్, ల్యాప్​టాప్, రూ.15 వేల నగదును దొంగిలించారు.

Love birds
సీసీ కెమెరాల్లో నిందితుడు వినయ్

తమ ఇంట్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి యజమాని ఇంటి అద్దెకోసం వచ్చిన జంట దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించి.. చంద్ర లేఅవుట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రేమజంటను అరెస్ట్ చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 9, 2021, 12:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.