ETV Bharat / bharat

'అంతరిక్ష రంగంలో త్వరలోనే విదేశీ పెట్టుబడులు' - ఇస్రో భాగస్వామ్య సంస్థలు ఏవి?

అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు(FDI) త్వరలోనే ఆమోదం లభించనుంది. ఈ మేరకు ఎఫ్​డీఐ విధానాన్ని సవరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఇస్రో ఛైర్మన్ కె. శివన్ తెలిపారు. ఈ రంగంలో పెట్టుబడి పెట్టేందుకు విదేశీ కంపెనీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.

MDS12-KA-ISRO
MDS12-KA-ISRO
author img

By

Published : Sep 14, 2021, 9:50 AM IST

అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించే విధానాన్ని త్వరలోనే రూపొందించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ కె. శివన్ తెలిపారు. దీనితో విదేశీ కంపెనీలు భారతీయ సంస్థలతో భాగస్వామ్యం ఏర్పరచుకుంటాయని.. ఫలితంగా ఈ రంగంలో అపార అవకాశాలు సొంతమవుతాయని అభిప్రాయపడ్డారు. పలు విదేశీ కంపెనీలు దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు వెల్లడించారు.

"అంతరిక్ష రంగంలో ఎఫ్‌డీఐ నిబంధనల సవరణ అనంతరం విదేశీ కంపెనీలు భారత్​లో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు ఉంటాయి. దీనితో భారతీయ, విదేశీ కంపెనీల మధ్య పరస్పర సహకారం పెరుగుతుంది. ఫలితంగా ఇరు దేశాలకూ ఎంతో ప్రయోజనం చేకూరుతుంది."

-కె.శివన్, ఇస్రో డైరెక్టర్

దేశంలో ప్రైవేట్ రంగంలో అంతరిక్ష కార్యకలాపాల నోడల్ ఏజెన్సీగా ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్( IN-SPACe), డీఓఎస్(DoS) వ్యవహరిస్తాయని పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.