ETV Bharat / bharat

దిల్లీ సహా మరో రెండు రాష్ట్రాల్లో లాక్​డౌన్ పొడిగింపు - దిల్లీలో లాక్ డౌన్ పొడిగింపు

కరోనా వ్యాప్తి అదుపులో లేనందున దిల్లీలో లాక్​డౌన్ పొడిగిస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. దిల్లీ బాటలోనే హరియాణా, జమ్ముకశ్మీర్ లు నడుస్తున్నాయి.

Lockdown
లాక్ డౌన్
author img

By

Published : May 16, 2021, 3:57 PM IST

కరోనా వ్యాప్తి నేపథ్యంలో దిల్లీలో లాక్​డౌన్​ను మే 24 వరకు పొడిగిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. ఏప్రిల్ 19న ప్రారంభమైన లాక్​డౌన్ మే 17తో ముగియనుంది. వైరస్ వ్యాప్తి అదుపులో లేనందున మరో వారం పాటు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హరియాణాలోనూ లాక్​డౌన్​ను మే 24 వరకు పొడిగిస్తున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

జమ్ముకశ్మీర్​లోనూ..

కరోనా వ్యాప్తి నేపథ్యంలో జమ్ముకశ్మీర్​లోనూ లాక్​డౌన్​ను మే 24 వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఏప్రిల్ 29న ప్రారంభమైన లాక్​డౌన్ మే 17తో ముగియనుంది. వైరస్ ఉద్ధృతి కొనసాగుతున్నందున మరో వారం పాటు పెంచుతున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

ఇప్పటికే 18 రోజుల నుంచి కొనసాగుతున్న లాక్​డౌన్​తో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్కెట్లు మూతపడ్డాయి. రోడ్లన్ని నిర్మానుష్యంగా మారాయి.

ఇదీ చదవండి: 120 ఏళ్ల క్రితమే దేశంలో లాక్​డౌన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.