దేశ రాజధాని దిల్లీలో కరోనా విలయతాండవం ఆగడం లేదు. నానాటికీ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో వైరస్ ఉద్ధృతి దృష్ట్యా ప్రస్తుతం అమలవుతున్న లాక్‌డౌన్‌ను మరో వారం పాటు పొడిగిస్తున్నట్టు దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
దిల్లీలో కరోనా విజృంభిస్తుండటం వల్ల ఏప్రిల్ 19వ తేదీ రాత్రి 10 గంటల నుంచి ఏప్రిల్ 26 వరకు పూర్తి స్థాయి లాక్‌డౌన్ విధిస్తున్నట్లు గతంలో సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. అయినప్పటికీ కేసుల్లో ఎలాంటి తగ్గుదల లేకపోయేసరికి మే 3వ తేదీ వరకు పొడిగించారు. ఆ గడువు సోమవారం ఉదయం 5 గంటలకు పూర్తవడం వల్ల తాజాగా మరో వారం పాటు లాక్‌డౌన్ కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇదీ చదవండి : 'ప్రాణాలు పోతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాం?'