ETV Bharat / bharat

'బాహుబలి' స్ఫూర్తితో విల్లు, బాణాల తయారీ - విల్లు, బాణాల తయారీ

విల్లు, బాణం అంటే నేటి కాలంలో సినిమాల్లో లేదా స్పోర్ట్స్​ ఈవెంట్​లలో చూడటం తప్ప నిజ జీవితంలో చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. నాటికాలంలో విరివిగా వాడిన ఈ ఆయుధాలు.. నేడు దాదాపుగా కనుమరుగైపోయాయి. అయితే.. కలిసొచ్చిన లాక్​డౌన్​ సమయంలో వీటిని తయారుచేస్తూ.. అందరికీ విలువిద్యను చేరువ చేస్తున్నాడు కేరళ యువకుడు. తన ప్రతిభా నైపుణ్యాలతో విల్లంబులు, బాణాలు తయారు చేస్తున్న ఆ మళయాలీ కళాకారుడిపై ప్రత్యేక కథనం..

Archers and Arrows
థామస్, విల్లు బాణాల తయారీ
author img

By

Published : May 15, 2021, 5:52 PM IST

Updated : May 15, 2021, 6:50 PM IST

విల్లు, బాణాలను తయారు చేస్తున్న కేరళ యువకుడు

కరోనా కట్టడికి విధించిన లాక్​డౌన్​తో వ్యాపారస్థులపై తీవ్ర ప్రభావం పడింది. ఈ సమయంలో కొందరు సరికొత్త దారులు వెతుకుతూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. అలాంటి కోవకే చెందుతారు తొట్టుముక్కాం ప్రాంతానికి చెందిన టిన్స్​ ఎం.థామస్​. తనక నైపుణ్యంతో విల్లు, బాణాలను ఎంతో అందంగా తీర్చిదిద్దుతూ ఔరా అనిపిస్తున్నాడు. అంతకుముందు.. ఈ పనిలో కొద్దిపాటి ప్రావీణ్యమున్న థామస్​.. లాక్​డౌన్ సమయంలో తన కళకు మరింత పదును పెట్టాడు.

'బాహుబలి' సినిమాతో మళ్లీ..

కరోనా వ్యాప్తితో గతేడాదిలోనే థామస్​ వ్యాపారం మందగించింది. ఈ సమయంలో లాక్​డౌన్​ విధించడం వల్ల.. ఇంటికే పరిమితమయ్యాడు. ఆ సమయంలో 'పఝాస్సీ రాజా', 'బాహుబలి' వంటి సినిమాలు చూశాడట. అందులో వాడే విల్లు, బాణాలను బాగా పరిశీలించి.. తానూ వాటిని తయారు చేయాలనుకున్నాడు థామస్​. ఈ క్రమంలో వాటిని రూపొందిస్తూ చాలాసార్లు విఫలమయ్యాడు. అలాగని అంతటితో ఆగలేదు. ఎలాగైనా దానిపై పట్టు సాధించాలనే దృఢ నిశ్చయంతో.. యూట్యూబ్​ ఛానళ్లను చూసి తన ప్రతిభకు సానపెట్టాడు. అలా.. అనేక ప్రయత్నాల తర్వాత ఎట్టకేలకు విజయవంతమయ్యాడు. ఇప్పుడు రకరకాల విల్లులు, బాణాలను అలవోకగా చేసేస్తూ అబ్బురపరుస్తున్నాడీ యువకుడు.

ఇదీ చదవండి: అసాధారణ ప్రతిభతో నాలుగేళ్లకే 'గూగుల్​ గర్ల్'​!

థామస్​ చేసే పలు రకాల బాణాలివే..

గిరిజన ప్రజలు వేట కోసం ఉపయోగించే విల్లంబులు, బాణాలనూ ఎంతో నేర్పుగా రూపొందిస్తున్నాడు థామస్. 3 లేదా 4 బాణాలను ఒకేసారి వదిలే 'ఓతాంబు(ఓతులి)', 'పరంకి పాతి'లనూ తయారుచేస్తున్నాడు. ఫిషింగ్​ గన్​ అని పిలిచే 'తోక్కు తెట్టాలీ' రకం విల్లంబులను కూడా ఇట్టే చేసేస్తున్నాడు. ఇతడు రూపొందించిన వాటిలో 'ఫోల్డబుల్​(మడిచేందుకు వీలుగా)' విల్లు కూడా ఉంది. దాన్ని మూడు భాగాలుగా మడిచి.. ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లవచ్చు.

విలు విద్యను అభ్యసించి..

వృత్తిపరంగా విలు విద్యను ఎంచుకున్న వారి కోసం.. విల్లులు, బాణాలను తయారు చేయడం ప్రారంభించాను అంటున్నాడు టిన్స్​. అంతటితో ఆగకుండా.. మరో అడుగు ముందుకేసి తానూ విలు విద్యను నేర్చేసుకున్నాడు. ఫలితంగా.. అతడు తయారు చేసే ప్రతి విల్లు, బాణాలను మరింత కచ్చితత్వం, పరిపూర్ణతతో పరీక్షించగలుగుతున్నాడు. తాను నేర్చుకున్న ఈ విలువిద్యతో సుమారు 30 నుంచి 50 మీటర్ల దూరంలోని లక్ష్యాలను ఎంతో కచ్చితంగా ఛేదిస్తూ.. అందరితో శెభాష్​ అనిపించుకున్నాడు.

ఇదీ చదవండి: ప్రోగ్రామింగ్​ను ఆటాడుకుంటున్న ఏడేళ్ల బుడతడు!

ఉపయోగించే సామగ్రి?

విల్లంబులు, బాణాల కోసం థామస్​.. మహోగని, అరేకా నట్​ పామ్​, వెదురు కలపలను ఉపయోగిస్తున్నాడు. బాణాల్ని వదిలేచోట(ట్రిగర్​) మాత్రం.. గేదె కొమ్ములతో తయారైన వస్తువుల్ని వినియోగిస్తానంటున్నాడు. ఇలా ఒక్కో విల్లు రూపొందించేందుకు సుమారు 3-4 రోజుల సమయం పడుతుందని ఈ విలువిద్య కళాకారుడు చెప్పుకొచ్చాడు. విల్లు, బాణంతో కూడిన ఒక సెట్​ ధర సుమారు రూ.2,000 నుంచి రూ.15,000 వరకూ ఉంటుంది.

నిబంధనలకు లోబడి..

థామస్​ ఎంతో ప్రతిభా నైపుణ్యాలను కలగలిపి తయారుచేసిన విల్లంబులు సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్​లలోనూ మంచి ప్రాచుర్యం పొందాయి. అయితే.. ఎంత డిమాండ్​ ఉన్నా.. అనవసరంగా ఎవరికీ విల్లు, బాణాలను విక్రయించనని తాను విధించుకున్న నిబంధనలకు కట్టుబడి ఉంటానంటున్నాడు టిన్స్​.

ఇదీ చదవండి: బాలుడి అద్భుత బ్యాటింగ్​కు ఐపీఎల్ ఫ్రాంఛైజీ ఫిదా

Last Updated : May 15, 2021, 6:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.