ETV Bharat / bharat

మహారాష్ట్రలో పూర్తి స్థాయి లాక్​డౌన్​! - Night Curfew

దేశంలో కొవిడ్ కేసులు అధికమవుతున్న వేళ.. లాక్​డౌన్​ విధించే దిశగా రాష్ట్రాలు ఆలోచన చేస్తున్నాయి. పరిస్థితి అదుపు దాటితే పూర్తి స్థాయి లాక్​డౌన్​ విధించే అవకాశముందని మహారాష్ట్ర ఆరోగ్యమంత్రి తెలిపారు. ఇప్పటికే పలు రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూ విధించగా.. మరికొన్ని రాష్ట్రాలు కరోనా నిబంధనలు పాటించనివారికి జరిమానా విధిస్తున్నాయి.

Lockdown
లాక్​డౌన్​
author img

By

Published : Apr 9, 2021, 11:10 PM IST

దేశంలో కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో లాక్​డౌన్​ యోచన చేస్తున్నాయి పలు రాష్ట్రాలు. పరిస్థితి అదుపు తప్పితే రెండు నుంచి మూడు వారాల పూర్తిస్థాయి లాక్​డౌన్ విధించే అవకాశం ఉందని మహారాష్ట్ర ఆరోగ్యమంత్రి రాజేశ్​ తోపే తెలిపారు.

"ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య పెరిగిపోయి.. మందుల కొరత అధికంగా ఉంటే అలాంటి చర్యలు తీసుకోవచ్చు." - రాజేశ్​ తోపే, మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి

రాష్ట్రంలో కరోనా కేసుల నిర్వహణపై వస్తున్న విమర్శలను ఖండించారు రాజేశ్​. టెస్టింగ్,​ ట్రేసింగ్​, ట్రీట్​మెంట్​ వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్రం ప్రొటోకాల్స్​ను కూడా పాటిస్తున్నట్లు తెలిపారు. ఈక్రమంలో మహారాష్ట్రపై కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్​ చేసిన వ్యాఖ్యలను తోసిపుచ్చారు.

అఖిలపక్ష భేటీ

రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై అఖిలపక్ష భేటి నిర్వహించనున్నారు సీఎం ఉద్ధవ్​ ఠాక్రే. ఈ మేరకు ఓ భాజపా నేత తెలిపారు. శుక్రవారమే సమావేశం జరగాల్సి ఉండగా.. ఓ పరీక్ష కారణంగా శనివారానికి వాయిదా వేసినట్లు వెల్లడించారు.

అండమాన్​లో రాత్రి కర్ఫ్యూ

దక్షిణ అండమాన్​లో కరోనా తీవ్రత పెరుగుతున్న వేళ ఏప్రిల్​ 10 నుంచి నెలాఖరు వరకు రాత్రి కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించారు అక్కడి అధికారులు.

రూ.5 వేలు జరిమానా

కరోనా తీవ్రత అధికమవుతున్న వేళ.. మాస్కు లేకుండా తిరిగేవారికి విధించే జరిమానా పెంచింది ఒడిశా ప్రభుత్వం. మాస్కు లేకుండా పట్టుబడితే రెండుసార్లు రూ.2వేల జరిమానా విధిస్తారు. మూడోసారి దొరికితే రూ.5వేలు జరిమానా విధిస్తారు. కొవిడ్​ నిబంధనల​ను సక్రమంగా పాటిస్తే లాక్​డౌన్ విధించాల్సిన అవసరం రాదని సీఎం నవీన్​ పట్నాయక్ అన్నారు.

10 రోజుల లాక్​డౌన్​

కర్ణాటకలో కరోనా ప్రభావం అధికంగా ఉన్న కొన్ని జిల్లాల్లో 10 రోజుల పాటు రాత్రి కర్ఫ్యూ అమలు చేయనున్నారు. ఏప్రిల్​ 10 నుంచి 20 వరకు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించనున్నట్లు పేర్కొన్నారు. అయితే నైట్​షిఫ్ట్​లో ఉద్యోగానికి వెళ్లేవారికి.. ఆరోగ్య, అత్యవసర సేవలకు మినహాయింపు ఇవ్వనున్నట్లు తెలిపారు.

పాఠశాలలు మూసివేత

దిల్లో కొవిడ్ ఉగ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో పాఠశాలలు మూసివేయాలని నిర్ణయించారు సీఎం అరవింద్​ కేజ్రీవాల్‌.

రాత్రి కర్ఫ్యూ

పుదుచ్చేరిలో శనివారం నుంచి రాత్రి కర్ఫ్యూ అమలు చేయాలని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై రాజన్​ నిర్ణయించారు.

149 జిల్లాల్లో జీరో కేసులు

దేశంలో కొవిడ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నప్పటికీ.. గత ఏడురోజులుగా 149 జిల్లాల్లో కొత్త కేసులు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్​ తెలిపారు. మరో ఎనిమిది రాష్ట్రాల్లో 15 రోజుల నుంచి కేసులు నమోదు కాలేదని పేర్కొన్నారు. మంత్రుల బృందంతో వీడియో కాన్ఫరెన్స్ ​ద్వారా నిర్వహించిన సమావేశంలో ఈ విషయాన్ని తెలిపారు.

ఇదీ చూడండి: 'కొవిడ్​ అనంతరం కొత్త ఉపాధి అవకాశాలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.