ETV Bharat / bharat

తండ్రి కోసం కుమార్తె త్యాగం.. హైకోర్టులో వాదించి గెలిచి, లివర్ దానం.. దేశంలో ఫస్ట్ టైమ్ ఇలా!

అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రికి కాలేయం దానం చేసింది 17 ఏళ్ల బాలిక. దీంతో దేశంలోనే మొదటిసారిగా అవయవదానం చేసిన తొలి మైనర్​గా రికార్డు సృష్టించింది. బాలిక తన తండ్రికి అవయవదానం చేయడంపై వైద్యులు ఆమెను అభినందించారు.

daughter donated liver to father
తండ్రికి కాలేయాన్ని దానం చేసిన కుమార్తె
author img

By

Published : Feb 18, 2023, 2:30 PM IST

కేరళకు చెందిన 17 ఏళ్ల బాలిక తండ్రి పట్ల ప్రేమను చాటుకుంది. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న తండ్రికి తన లివర్​లోని కొంత భాగాన్ని దానం చేసి ఔరా అనిపించుకుంది. ఫిబ్రవరి 9న రాజగిరి ఆస్పత్రిలో శస్త్రచికిత్స నిర్వహించి బాలిక లివర్​లో కొంత భాగాన్ని ఆమె తండ్రికి అమర్చారు వైద్యులు. దీంతో దేశంలోనే మొదటిసారిగా అవయవదానం చేసిన తొలి మైనర్​గా రికార్డు సృష్టించింది దేవానంద.

ఇదీ అసలు కథ..
త్రిస్సూర్​లోని కొలాజీకి చెందిన ప్రతీశ్​(48) గత కొన్నేళ్లుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. అవయవ మార్పిడి చేయకపోతే ప్రతీశ్ ఇంకెన్నో రోజులు బతకడని వైద్యులు చెప్పారు. కాలేయాన్ని దానం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ప్రతీశ్ కుమార్తె దేవానంద(17) తన తండ్రికి లివర్​ను దానం చేసేందుకు సిద్ధమైంది. అయితే సర్జరీకి వైద్యులు ఇచ్చిన గడువు దగ్గర పడడం వల్ల ప్రతీశ్ కుమార్తె దేవానంద తన కాలేయాన్ని ఇస్తానని వైద్యులకు తెలిపింది. దేవానంద మైనర్ కావడం వల్ల చట్టం అందుకు అంగీకరించదని వైద్యులు స్పష్టం చేశారు. దీంతో చేసేదేమీలేక దేవానంద.. కేరళ హైకోర్టును ఆశ్రయించింది.

తండ్రిని బతికించుకోవడం కోసం తన కాలేయాన్ని దానం చేసేందుకు అనుమతివ్వాలని కేరళ హైకోర్టును కోరింది. ట్రాన్స్​ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్ యాక్ట్ 1994 ప్రకారం.. వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది కోర్టు. అవయవదానం చేసినా బాలిక ప్రాణానికి ఎటువంటి ప్రమాదం ఉండదని నిపుణులు ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకుంది కోర్టు. దేవానంద తన తండ్రికి కాలేయం దానం చేసేందుకు అనుమతిచ్చారు జస్టిస్ వీజీ అరుణ్.

మొదట తన కుమార్తె నుంచి కాలేయాన్ని పొందేందుకు ప్రతీశ్ అంగీకరించలేదు. తన కోసం కుమార్తె ప్రాణాలను పణంగా పెట్టలేనని అన్నాడు. కుటుంబ సభ్యులు కూడా దేవానంద భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సర్జరీకి మొదట అంగీకరించలేదు. వారందరికీ దేవానందే నచ్చజెప్పింది. తానేమి గొప్పదానం చేయట్లేదని తండ్రిని కాపాడుకోవడం కనీస బాధ్యతని కుటుంబ సభ్యులకు వివరించింది. దీంతో దేవానంద కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. ఈ క్రమంలో కోర్టు అనుమతితో దేవానంద కాలేయంలో కొంత భాగాన్ని ఆమె తండ్రి ప్రతీశ్​కు అమర్చారు రాజగిరి ఆస్పత్రి వైద్యులు.

"అవయవదానంలో దేవానంద రోల్ మోడల్. ఆమె ఎంతో మందికి స్ఫూర్తి. దేవానంద లివర్​లో కొంత భాగాన్ని దానం చేసిన తర్వాత ఆస్పత్రిలో వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇప్పుడు ఆమె క్రమంగా కోలుకుంటోంది. మార్చిలో ఆమెకు 12వ తరగతి పబ్లిక్ పరీక్షలు ఉన్నాయి. దేవానంద సాహసాన్ని చూసి ఆమె సర్జరీ, మెడికల్ ఖర్చులన్నీ మాఫీ చేశాం."

--రాజగిరి ఆస్పత్రి వైద్యుడు ఆర్​.ఎన్​. మేనన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.