ETV Bharat / bharat

16వ రోజుకు నిరసనలు- కేంద్రానికి రైతన్న హెచ్చరిక - నూతన వ్యవసాయ చట్టాలు

farmers protest
రైతుల ఆందోళనలు
author img

By

Published : Dec 11, 2020, 8:52 AM IST

Updated : Dec 11, 2020, 10:28 AM IST

10:27 December 11

ఆందోళనలు ఉద్ధృతం..

నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని దిల్లీలో రైతుల నిరసనలు 16వ రోజుకు చేరాయి. కేంద్రం దిగొచ్చి చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేస్తున్నారు రైతులు. అయితే చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్న ప్రభుత్వం.. చట్టాలను మాత్రం వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని మరోమారు తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఆందోళనను ఉద్ధృతం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు అన్నదాతలు.

కరోనా కల్లోలం...

రైతులు నిరసనలు చేపట్టిన టిక్రి, సింఘు, ఘాజిపూర్​, నోయిడా సరిహద్దు ప్రాంతాల్లో బలగాలను భారీగా మోహరించింది కేంద్రం. అయితే సింఘు సరిహద్దులో కరోనా కలకలం సృష్టించింది. ఆ ప్రాంతంలో మోహరించిన పోలీసు సిబ్బందిలో ఇద్దరికి కరోనా పాజిటివ్​గా తేలింది.

ఎన్ని అడ్డంకులు వచ్చినా తాము మాత్రం వెనక్కి తగ్గేది లేదని రోడ్ల మీద బైఠాయించి నిరసనలు తెలుపుతున్నారు అన్నదాతలు. ఆందోళనల్లో భాగంగా శనివారం దిల్లీ-జయపుర, దిల్లీ-ఆగ్రా రహదారులను దిగ్బంధిస్తామని వెల్లడించారు. ఈ తరుణంలో శనివారం.. టోల్​ గేట్ల వద్ద ఫీజు కట్టకుండా నిరసన తెలపాలని యావత్​ దేశానికి పిలుపునిచ్చారు. త్వరలో రైల్వే ట్రాక్​లు ముట్టిడిస్తామని స్పష్టం చేశారు.

సర్వత్రా మద్దతు...

దేశవ్యాప్తంగా రైతుల ఆందోళనలకు మద్దతు లభిస్తోంది. అమృత్​సర్​లోని కిసాన్​ మజ్​దూర్​ సంఘర్ష్​ కమిటీ సభ్యులు.. 700 ట్రాక్టర్లతో దిల్లీకి బయలుదేరారు. కుండ్లి సరిహద్దులో ఆందోళనలు చేపట్టేందుకు వెళుతున్నట్టు కమిటీ సభ్యులు వెల్లడించారు.

మరోవైపు 16రోజులుగా నిర్విరామంగా పోరాడుతున్న రైతులకు స్వచ్ఛంద సంస్థలు అండగా నిలుస్తున్నాయి. అమృత్​సర్​కు చెందిన ఓ బృందం.. ఘాజీపుర్​ సరిహద్దు వద్ద ఉన్న రైతులకు భోజనం ఏర్పాట్లు చేస్తోంది. లెక్కలేనంత మందికి ఆహారం కల్పిస్తోంది. ప్రభుత్వం అన్నదాతల మాట వినేంతవరకు కొనసాగిస్తామని స్పష్టం చేసింది. 

09:38 December 11

రైతులకు ఆహారం అందజేత

  • Delhi: Charity service from Amritsar provides meals to agitating farmers who're protesting new farm laws, at Ghazipur border

    "There's no count of people who're fed. From 5am-9pm we serve food. We'll continue until govt listens to farmers," says senior member of the establishment pic.twitter.com/1BYl7GmBgD

    — ANI (@ANI) December 11, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఘాజీపుర్​ సరిహద్దులో ఆందోళనలు చేస్తోన్న రైతులకు ఆహారం అందిస్తున్నారు అమృత్​సర్​కు చెందిన స్వచ్ఛంద సేవకులు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అందిస్తున్నట్లు చెప్పారు. రైతుల ఆందోళనపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి నిరసనలు ముగిసే వరకు తాము కొనసాగిస్తామన్నారు.

09:30 December 11

ముగ్గురు పోలీసు అధికారులకు కరోనా

సింఘు సరిహద్దులో రైతుల ఆందోళనల వద్ద మోహరించిన పోలీసుల బలగాల్లో ముగ్గురు అధికారులకు కరోనా సోకింది. డీసీపీ, అదనపు డీసీపీ సహా మరో అధికారికి పాజిటివ్​గా వచ్చినట్లు దిల్లీ పోలీసు విభాగం వెల్లడించింది.

08:44 December 11

  • Farmers protest against Centre's farm laws at Tikri border enters 16th day

    Union Agriculture Minister Narendra Singh Tomar yesterday said that the government is open for further discussions with farmers and they should end their agitation pic.twitter.com/FEC8G0n48h

కేంద్రానికి రైతన్న హెచ్చరిక...

  • 16వ రోజు కొనసాగుతున్న అన్నదాతల ఆందోళన.
  • దిల్లీ సరిహద్దుల్లోని సింఘు, టిక్రి, ఘాజిపూర్, నోయిడాలో రోడ్లపై రైతుల నిరసన.
  • కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్.
  • కేంద్రం దిగిరాకుంటే ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరిస్తున్న రైతులు.
  • త్వరలో రైల్వే ట్రాక్​లు ముట్టడిస్తామన్న రైతు సంఘాలు.
  • రేపు దిల్లీ-జయపుర, దిల్లీ-ఆగ్రా రహదారులను దిగ్బంధిస్తామని వెల్లడి.
  • రేపు దేశంలో టోల్ గేట్ల వద్ద ఫీజు కట్టకుండా నిరసన తెలపాలని పిలువు.

Last Updated : Dec 11, 2020, 10:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.