ETV Bharat / bharat

14 అసెంబ్లీలకు ఎన్నికలు.. భాజపా- మిత్రులకు 5 - భాజపా ఎన్నికలు

2019 సార్వత్రిక ఎన్నికల నుంచి దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఎన్నికలు జరిగాయి. ఇందులో భాజపా 5 రాష్ట్రాల్లో పాలన సాగిస్తుండగా.. మరో నాలుగు రాష్ట్రాల్లో మిత్రపక్షంగా ఉంది.

List of BJP ruling states after 2021 assembly elections
14 అసెంబ్లీలకు ఎన్నికలు.. భాజపా- మిత్రులకు 5
author img

By

Published : May 3, 2021, 6:34 AM IST

గత సార్వత్రిక ఎన్నికల దగ్గర నుంచి చూస్తే మొత్తం 14 రాష్ట్రాలకు ఎన్నికలు జరగగా.. భాజపా అయిదు చోట్ల ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలిగింది. అదివరకు అధికారంలో ఉన్న రెండు రాష్ట్రాలను కోల్పోయింది. మిత్రపక్షాలతో కలిసి నాలుగు రాష్ట్రాలను నెలబెట్టుకొంది. కొత్తగా ఒక రాష్ట్రాన్ని కైవసం చేసుకొంది.

2019లో లోక్‌సభ ఎన్నికలతోపాటు జరిగిన సిక్కిం, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. అక్కడ భాజపాయేతర ప్రాంతీయ పార్టీలు విజయం సాధించాయి. అదే సంవత్సరం జరిగిన అరుణాల్‌ప్రదేశ్‌ ఎన్నికల్లో మిత్రపక్షాలతో కలిసి ఘన విజయం సాధించింది. హరియాణా ఎన్నికల్లో ఏకైక పెద్దపార్టీగా అవతరించి ఎన్నికల అనంతరం జననాయక్‌ జనతాపార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఝార్ఖండ్‌ ఎన్నికల్లో పరాభావం చవిచూసింది. మహారాష్ట్ర ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచినప్పటికీ మిత్రపక్షమైన శివసేన దూరం కావడంతో అధికారానికి దూరమైంది.

2020లో దిల్లీలో ఓడింది. బిహార్‌ ఎన్నికల్లో జేడీయూతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. 2021 ఎన్నికల్లో కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌ల్లో అధికారం దక్కలేదు. అస్సాంలో మాత్రం మిత్రపక్షాలతో కలిసి వరుసగా రెండోసారి అధికారం చేజిక్కించుకొంది. పుదుచ్చేరిలో ఆల్‌ ఇండియా ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. ప్రస్తుత భాజపా మిత్రపక్షాల చేతుల్లో ఉన్న 5 రాష్ట్రాల్లో మూడింట ఆ పార్టీ అభ్యర్థులు సీఎంలుగా ఉండగా, మరో రెండుచోట్ల మిత్రపక్షాల అభ్యర్థులు ప్రభుత్వాలకు నేతృత్వం వహిస్తున్నారు.

  • మిత్రపక్షాలతో కలిసి భాజపా అధికారం కైవసం చేసుకున్న రాష్ట్రాలు: అరుణాల్‌ప్రదేశ్‌, హరియాణా, బిహార్‌, అస్సాం, పుదుచ్చేరి
  • కోల్పోయిన రాష్ట్రాలు: మహారాష్ట్ర, ఝార్ఖండ్‌
  • ప్రాంతీయపార్టీలు గెలిచినవి: సిక్కిం, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌, దిల్లీ
  • తాజాగా పోరాడినా ఫలితం లేనివి: పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, కేరళ

ఇదీ చూడండి:- ఫలితం తేలింది.. ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.