కేరళ తిరువనంతపురంలో జైలు నుంచి పరారయ్యేందుకు ఖైదీ విఫలయత్నం చేశాడు. యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఖైదీ జైలు నుంచి పారిపోయేందుకు చెట్టు ఎక్కగా ఇరుక్కుపోయాడు. ఈ ఘటన పూజప్పుర సెంట్రల్ జైల్లో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహయక చర్యలు చేపట్టారు. గంటన్నర పైగా చెట్టుపైనే ఉండి హడావుడి సృష్టించాడు ఖైదీ. పోలీసులు కిందకు దించేందుకు ప్రయత్నించినా వినలేదు. చివరకు చెట్టు కొమ్మ విరగడం వల్ల సిబ్బంది పెట్టిన వలలో పడిపోయాడు. అనంతరం జైలులోని ఆస్పత్రికి తరలించారు. ఖైదీని కొట్టాయంకు చెందిన సుభాశ్గా గుర్తించారు. హత్య కేసులో శిక్ష అనభవిస్తున్న అతడు.. నెట్టుకల్తేరి జైలు నుంచి పూజప్పురకు వచ్చాడు.
కోర్టులో నిందితుడి ఆత్మహత్య: గుజరాత్ సూరత్‌లో ఓ నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. భారత్ ఇటాలియా(65) అనే నిందితుడు కోర్టు భవనం రెండో అంతస్తు నుంచి దూకాడు. ఛీటింగ్ కేసులో నిందితుడైన ఇటాలియాను.. కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే విచారణకు వెళ్తుండగా.. రెండో అంతస్తు నుంచి దూకాడు. తీవ్ర గాయాలైన నిందితుడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చదవండి:
ముఖ్యమంత్రికి చల్లారిన టీ.. అధికారికి షోకాజ్ నోటీసు!
కోట్ల విలువైన హెరాయిన్ సీజ్.. మళ్లీ ముంద్రా పోర్ట్ దగ్గరే!