జమ్ముకశ్మీర్లో పౌరులపై దాడులకు (Civillian Killings in Kashmir) ప్రతిగా ఉగ్రమూకల ఏరివేత ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. పుల్వామా జిల్లాలో శనివారం జరిపిన కాల్పుల్లో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు (Militants Killed in Kashmir) హతమయ్యారు. వారిలో లష్కరే కమాండర్ ఉమర్ ముస్తాక్ ఖాండే ఉన్నాడని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
ఈ ఏడాది తొలినాళ్లలో ఇద్దరు పోలీసుల హత్యతో ఖాండేకు సంబంధం ఉందనే ఆరోపణలున్నాయి. ముష్కరులు పౌరులను చంపిన అనంతరం.. ఇప్పటికే చేపట్టిన 8 ఎన్కౌంటర్లలో 11 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టగా, ఈ ఎన్కౌంటర్తో కలిపి చనిపోయిన ఉగ్రవాదుల సంఖ్య 13కు చేరింది.
ఇదీ చూడండి: ఉగ్ర ఏరివేత: 8 ఎన్ కౌంటర్లు.. 11మంది ముష్కరులు హతం