ETV Bharat / bharat

మైసూర్ ప్యాలెస్​కు 'లీకేజీ' కష్టాలు- రాజకుటుంబీకుల అసహనం - beauty of mysore palace

ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కర్ణాటకలోని చారిత్రక మైసూర్ ప్యాలెస్​ భవనం దెబ్బతింది. ప్యాలెస్​లోని చాలా ప్రాంతాల్లో పైకప్పు నుంచి వర్షపు నీరు(Mysore palace leakage) కారుతోంది. ప్యాలెస్ గోడలపై నాచు పేరుకుపోయింది.

Leakage at the roof of the Mysore Palace
వర్షాలకు దెబ్బతిన్న మైసూర్ భవనం
author img

By

Published : Nov 26, 2021, 12:46 PM IST

Updated : Nov 26, 2021, 2:49 PM IST

మైసూర్ ప్యాలెస్​కు 'లీకేజీ' కష్టాలు

కర్ణాటక అనగానే గుర్తొచ్చే చారిత్రక కట్టడం మైసూర్​ ప్యాలెస్​. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ భవనం.. ఇప్పుడు తన అందాలను కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల(karnataka rain) ధాటికి ప్యాలెస్(Mysore palace leakage)​ దెబ్బతింది. పైకప్పు నుంచి అక్కడక్కడా వర్షపు నీరు కారుతోంది. పైకప్పునకు ఉన్న ప్లాస్టరింగ్ దెబ్బతింది. ప్యాలెస్ గోడలు తడిగా మారి, నాచు పేరుకుపోయాయి.

Mysore Palace
పైకప్పు నుంచి కారుతున్న వర్షపు నీరు
Mysore Palace
పైకప్పు ప్లాస్టర్ ఊడిపోయిన దృశ్యం

గతంలో కూడా మైసూర్​ ప్యాలెస్​ లీకేజీ సమస్యను ఎదుర్కొంది. అయితే.. అప్పుడు మరమ్మతులు చేశారు. కానీ, ఇటీవల కురిసిన వర్షాల కారణంగా.. ప్యాలెస్​లో మళ్లీ లీకేజీ సమస్య ఎదురవుతోంది. ప్యాలెస్​లో రాజకుటుంబ సభ్యులు నివసించిన ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది.

Mysore Palace
ప్యాలెస్ గోడలపై పేరుకుపోయిన నాచు
Mysore Palace
మైసూర్ ప్యాలెస్​

ప్యాలెస్ నిర్వహణలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై యదువీర్​ కృష్ణదత్త చామరాజా వడియార్ తల్లి ప్రమోదా దేవీ వడియార్ అసంతృప్తి వ్యక్తం చేశారని ప్యాలెస్ వర్గాలు తెలిపాయి. అయితే.. వర్షాల కారణంగా బోర్డు పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో ఎలాంటి సమస్య ఎదురవలేదని మైసూర్ ప్యాలెస్ బోర్డ్ డిప్యూటీ డైరెక్టర్ టీఎస్ సుబ్రహ్మణ్య తెలిపారు.

అధికారులు తక్షణమే స్పందించి.. మరమ్మతులు చేపట్టకపోతే.. ప్యాలెస్​ పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి: ల్యాబ్​లోకి వరద నీరు.. శాస్త్రవేత్తల కష్టం నీటి పాలు!

Last Updated : Nov 26, 2021, 2:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.