ETV Bharat / bharat

రైతులకు మద్దతుగా సీజేఐకి 141మంది లాయర్లు లేఖ - సీజేఐకి 141 మంది న్యాయవాదులు లేఖ

రైతులకు మద్దతుగా 141 మంది న్యాయవాదులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ బోబ్డేకు లేఖ రాశారు. దిల్లీ పరిసరాల్లోని పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవల నిలిపివేతపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సేవలను పునరుద్ధరించేలా హోంశాఖకు ఆదేశాలివ్వాలని లేఖలో కోరారు.

lawyers-write-to-cji-against-internet-suspension-at-farmers-protest-site
రైతులకు మద్దుతుగా సీజేఐకి 141 మంది లాయర్లు లేఖ
author img

By

Published : Feb 3, 2021, 7:52 PM IST

Updated : Feb 3, 2021, 10:31 PM IST

దిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులకు బాసటగా నిలిచే వారి సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోతోంది. ఈ జాబితాలో తాజాగా న్యాయవాదులు చేరారు. రైతులకు మద్దతుగా 141 మంది న్యాయవాదులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ బోబ్డేకు లేఖ రాశారు.

దేశ రాజధాని దిల్లీ పరిసరాల్లోని పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవల నిలిపివేతపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సూమోటోగా ఈ అంశంపై విచారణ జరిపించాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించేలా హోంశాఖకు ఆదేశాలివ్వాలని న్యాయవాదులు సీజేఐని కోరారు.

జనవరి 29న రైతులపై సింఘు సరిహద్దులో స్థానికుల పేరుతో జరిగిన దాడి ఘటనపై దర్యాప్తుకు కమిషన్ ఏర్పాటు చేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు. రైతులు, వారి ఆందోళనలపై వదంతులు, అసత్యాలను ప్రచారం చేస్తున్న జర్నలిస్టులు, మీడియా సంస్థలపై చర్యలు తీసుకోవాలన్నారు.

ఇదీ చదవండి: రైతుల నిరసన ప్రాంతాల్లో అంతర్జాల​ సేవలు బంద్!​​

Last Updated : Feb 3, 2021, 10:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.