ETV Bharat / bharat

జొమాటోకు 'హిందీ' సెగ.. తమిళనాడులో రచ్చ! - జొమాటో

ఫుడ్​ డెలివరి సంస్థ జొమాటో.. వివాదాస్పదన ఘటనలతో(zomato controversy in hindi) ఈ మధ్య కాలంలో వార్తల్లో నిలుస్తోంది. తాజాగా.. తమిళనాడులో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ వ్యక్తి రెస్టారెంట్​ నుంచి ఫుడ్​ ఆర్డర్​ ఇవ్వగా.. తనకు రావాల్సినవి సరిగ్గా అందలేదు. దీంతో జొమాటో కస్టమర్​ కేర్​కు(zomato customer care) ఫోన్​ చేశాడు. రెస్టారెంట్​తో భాషపరమైన ఇబ్బందులు తలెత్తడం వల్ల సమస్యను పరిష్కరించలేకపోయాడు కస్టమర్​ కేర్​ సభ్యుడు. తమిళనాడులో జొమాటో ఉన్నప్పుడు, తమిళ సిబ్బందిని నియమించుకోవాలి కదా? అని అడిగిన ఆ వ్యక్తికి.. 'హిందీ జాతీయ భాష. భారతీయుడిగా పుట్టడం వల్ల కొంతైనా హిందీ నేర్చుకోవాలి,' అన్న జవాబు లభించింది.

Zomato
జొమాటో
author img

By

Published : Oct 19, 2021, 12:13 PM IST

Updated : Oct 19, 2021, 5:13 PM IST

తమిళనాడుకు చెందిన వికాస్​​ అనే వ్యక్తి ఇటీవలే జొమాటోలో ఫుడ్​ ఆర్డర్​ ఇచ్చాడు(zomato controversy in hindi). రెండు చికెన్​ రైస్​ బౌల్స్​ కాంబో(చికెన్​ రైస్​+ పెప్పర్​ చికెన్​)ను ఆర్డర్​ పెట్టాడు. కానీ వికాస్​కు చికెన్​ రైస్​ మాత్రమే వచ్చింది. వెంటనే జొమాటో కస్టమర్​ సర్వీస్​కు ఫోన్​ చేశాడు. కొద్దిసేపటి తర్వాత రెస్టారెంట్​ నెంబర్​ను వికాస్​కు(zomato customer care) ఇచ్చారు. ఆ నెంబర్​కు ఫోన్​ చేయగా.. ముందు జొమాటోలో ఫిర్యాదు చేసి రీఫండ్​ పొందాలని రెస్టారెంట్​ సభ్యులు చెప్పారు.

దీంతో వికాస్​ తిరిగి జొమాటో కస్టమర్​ సర్వీస్​కు ఫోన్​ చేశాడు. తన డబ్బును రీఫండ్​ చేయాలని అడిగాడు. తమకు రెస్టారెంట్​ నుంచి ఎలాంటి సమాచారం లేదని బదులిచ్చాడు ఆ కస్టమర్​ సర్వీస్​ సభ్యుడు. ఆర్డర్​ సరిగ్గా ఇచ్చారా? లేదా? అని పదేపదే ప్రశ్నించాడు. ఈలోపు ఐదు సార్లు రెస్టారెంట్​కు ఫోన్​ చేశాడు. ఫలితం లేకపోవడం వల్ల 'భాష'పరంగా ఇబ్బందులు ఉన్నాయని అందుకే సమస్య పరిష్కారం కావడం లేదని వికాస్​కు చెప్పాడు.

దీనితో కోపం తెచ్చుకున్న వికాస్​.. 'తమిళనాడులో జొమాటో ఉంటే, తమిళం అర్థమయ్యే వారినే ఉద్యోగంలో పెట్టుకోవాలి. రెస్టారెంట్​ వారిని నా డబ్బులు తిరిగివ్వమని చెప్పండి. లేకపోతే మీరే రీఫండ్​ చేయండి,' అని అన్నాడు.

దీంతో అవతలి వ్యక్తికీ కోపం వచ్చింది. 'మీకో విషయం చెప్పదలుచుకున్నాను. హిందీ మన జాతీయ భాష. ప్రతి ఒక్కరు కొంతైనా హిందీని నేర్చుకోవాలి,' అని అన్నాడు.

వికాస్​కు కోపం మరింత పెరిగింది. ఈ వ్యవహారాన్ని, వారి మధ్య జరిగిన సంభాషణను ట్విట్టర్​లో పోస్ట్​ చేశాడు.

"జొమాటోలో ఫుడ్​ ఆర్డర్​ ఇచ్చాను. ఆర్డర్​ సరిగ్గా రాలేదు. నాకు హిందీ రాదన్న కారణంతో డబ్బులు రీఫండ్​ చేయడం కుదరదని జొమాటో కస్టమర్​ సర్వీస్​ అంటోంది. భారతీయుడిన అయ్యుండి నాకు హిందీ కచ్చితంగా వచ్చుండాలని చెబుతోంది. అతనికి తమిళ రాకపోవడం వల్ల నేను అబద్ధం చెబుతున్నా అంటున్నాడు. జొమాటో.. కస్టమర్లతో ప్రవర్తించే విధానం ఇది కాదు."

వికాస్​, తమిళనాడు.

వికాస్​ పోస్ట్​ సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. నెటిజన్లు, ముఖ్యంగా తమిళులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యకు జొమాటో శాశ్వత పరిష్కారాన్ని అందివ్వాలని డిమాండ్​ చేస్తున్నారు(zomato controversy in hindi).

ఉద్యోగిని తొలిగించి మళ్లీ..

ఈ వ్యవహారంపై జొమాటో స్పందించింది. వికాస్​తో మాట్లాడిన కస్టమర్ కేర్ ఉద్యోగిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే కొద్ది సేపటికే ఆ ఉద్యోగిని తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నట్లు జొమాటో వ్యవస్థాపకుడు దీంపిదర్​ గోయల్ తెలిపారు. మనమంతా ఒకరి లోపాల్ని మరొకరు ఎత్తిచూపకూడదని, అన్ని భాషలు, ప్రాంతీయ భావాలను గౌరవించాలని ట్వీట్​ చేశారు.

డెలివరిలో లోపాలు, కస్టమర్​-డెలివరీ సభ్యుడి మధ్య ఘటనలతో ఈ మధ్య కాలంలో జొమాటో వార్తల్లో నిలుస్తోంది. తాజా ఘటన జొమాటోకు మరింత ప్రతికూలంగా మారే అవకాశముంది.

ఇవీ చూడండి:-

Last Updated : Oct 19, 2021, 5:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.