మహారాష్ట్ర రాయ్‌గఢ్ జిల్లాలోని మహద్ తలై గ్రామంలో కొండచరియలు విరిగిపడ్డాయి. సుమారు 300 మంది పౌరులు చిక్కుకున్నట్లు జిల్లా యంత్రాంగం ప్రాథమికంగా అంచనా వేసింది.
ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి సమాచారం అందించినట్లు రాయ్‌గఢ్ జిల్లా కలెక్టర్ తెలిపారు. భారీ వర్షాల కారణంగా నిల్చిన నీటితో ఘటనా స్థలానికి చేరుకోలేకపోతున్నట్లు వెల్లడించారు.
ఈ ఘటనపై కేంద్రం సహాయాన్ని కోరింది మహారాష్ట్ర ప్రభుత్వం. కొండచరియల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి ఆర్మీ, నేవీ బృందాలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.