ETV Bharat / bharat

లఖింపుర్ ఖేరి​ కేసులో మరో ఇద్దరు అరెస్టు - లఖింపుర్​ ఖేరి కేసులో సిట్​

లఖింపుర్ హింసాత్మక ఘటన(Lakhimpur Kheri Incident) కేసులో మరో ఇద్దరిని ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్టు చేసింది. నిందితులను రంజిత్​ సింగ్​, అవతార్​ సింగ్​గా అధికారులు గుర్తించారు.

Lakimpur Kheri violence
లఖింపుర్ ఖేరి​ కేసు
author img

By

Published : Nov 4, 2021, 6:18 AM IST

లఖింపుర్​ ఖేరి హింసాత్మక ఘటన(Lakhimpur Kheri Incident) కేసులో మరో ఇద్దరిని ఉత్తర్​ప్రదేశ్​ పోలీసు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్​) అరెస్టు చేసింది. నిందితులను రంజిత్​ సింగ్​, అవతార్ సింగ్​గా అధికారులు గుర్తించారు. అక్టోబరు 3న రైతులపై ఎస్​యూవీ వాహనం దూసుకెళ్లి.. నలుగురు రైతులు మరణించిన తర్వాత.. ఇద్దరు భాజపా కార్యకర్తలు, ఓ డ్రైవర్​, ఓ స్థానిక విలేకరిపై వీరు దాడులకు(Lakhimpur Kheri Incident) పాల్పడినట్లు అధికారులు చెప్పారు.

టికోనియా పోలీస్​ స్టేషన్​లో నిందితులపై రెండో ఎఫ్​ఐఆర్​ నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు రెండో ఎఫ్​ఐఆర్​ కింద నలుగురిని అరెస్టు చేసినట్లు చెప్పారు. విచిత్రా సింగ్​, గుర్విందర్ సింగ్​ను ఇదివరకే అరెస్టు చేసి, జైలుకు తరలించినట్లు చెప్పారు.

నిందితులు రంజిత్ సింగ్​, అవతార్​ సింగ్​ను న్యాయస్థానం ముందు హాజరుపరుస్తామని సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్​ ఎస్​పీ యాదవ్ తెలిపారు. న్యాయస్థానం వారికి జ్యుడిషియల్ కస్టడి విధించే అవకాశం ఉందని చెప్పారు.

మరోవైపు... లఖింపుర్​ ఖేరి కేసులో అరెస్టైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిశ్​ మిశ్రతో పాటు మరో ఇద్దరు నిందితులు పెట్టుకున్న బెయిల్​ పిటిషన్​ విచారణను న్యాయస్థానం నవంబర్​ 15కు వాయిదా వేసింది.

ఇవీ చూడండి:

Lakhimpur Kheri incident: రైతులపైకి కేంద్ర మంత్రి కారు దూసుకెళ్లిన దృశ్యాలు!

'లఖింపుర్​ ఘటన'పై యోగి సర్కార్​కు నిరసన సెగ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.