ETV Bharat / bharat

లఖింపుర్​ ఘటనకు నిరసనగా.. రైతుల 'రైల్​ రోకో'

author img

By

Published : Oct 18, 2021, 10:50 AM IST

Updated : Oct 18, 2021, 11:18 AM IST

కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ.. రైతు సంఘాలు రైలురోకోను చేపట్టాయి. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆందోళన చేపట్టాలని నిర్ణయించాయి. అయితే ఈ ఆందోళనలో పాల్గొనేవారిపై కేసులు నమోదు చేస్తామని లఖ్​నవూ పోలీసులు హెచ్చరించారు.

rail-roko
రైతు సంఘాల రైల్​రోకో

లఖింపుర్​ ఖేరీ హింసాత్మక ఘటన నేపథ్యంలో రైతు సంఘాలు సోమవారం రైల్​ రోకో చేపట్టాయి. ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి అజయ్​ మిశ్రా రాజీనామా చేయాలని డిమాండ్​ చేశాయి.

Lakhimpur Kheri incident rail-roko
రైతు సంఘాల ఆధ్వర్యంలో రైల్​రోకో

లఖింపుర్​ ఖేరి ఘటనలో అజయ్​ మిశ్రా కుమారుడు ఆశిష్​ మిశ్రా ప్రధాన నిందితునిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రిగా ఉన్న అజయ్​ను మంత్రి వర్గం నుంచి తొలగిస్తే బాధితులకు న్యాయం జరుగుతుందని.. రైల్​ రోకోకు పిలుపునిచ్చిన సంయుక్త కిసాన్ మోర్చా పేర్కొంది. ఈ మేరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రైళ్ల రాకపోకలను స్తంభించేలా చేయాలని పిలుపునిచ్చింది. అయితే ధర్నా ప్రశాంతంగా సాగాలని కోరింది. రైతులు ఎవరూ రైల్వే ఆస్తుల విధ్వంసానికి పాల్పడవద్దని సూచించింది.

Lakhimpur Kheri incident rail-roko
రైల్​ రోకో నిర్వహిస్తున్న రైతులు

లఖింపుర్​ ఖేరి ఘటనలో మొత్తంగా 8 మంది చనిపోయారు. వీరిలో నలుగురు రైతులు కూడా ఉన్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో కారులో కేంద్ర మంత్రి అజయ్​ మిశ్రా కుమారుడు ఆశిష్​ ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి.

Lakhimpur Kheri incident rail-roko
రైలు పట్టాలపై కూర్చుని ఆందోళన చేస్తున్న అన్నదాతలు

కఠిన చర్యలు తీసుకుంటాం..

రైతు సంఘాలు పిలుపునిచ్చిన రైల్​ రోకోలో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తర్​ప్రదేశ్​ లఖ్​నవూ పోలీసులు హెచ్చరించారు. ఈ మేరకు నగరంలో 144 సెక్షన్​ విధించారు. నలుగురు కంటే ఎక్కువమంది గుమిగూడి కనిపిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. శాంతిభద్రతలు విఘాతం కలిగిస్తే వారిపై దేశద్రోహ చట్టం కింద కేసులు పెడతామని హెచ్చరించారు.

నిలిచిన రాకపోకలు..

రైతు సంఘాలు చేపట్టిన రైల్​రోకోతో పంజాబ్​లోని కొన్ని ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఫిరోజ్​పుర్​ డివిజన్​లోని నాలుగు సెక్షన్​లను ఆందోళనకారులు​ అడ్డుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నగరంలోని ఫిరోజ్‌పూర్-ఫాజిల్కా, మొగాలోని అజిత్వాల్ వద్ద ఉన్న ఫిరోజ్​పుర్​- లూధియానా వైపు నడిచే రైళ్లలు స్తంభించినట్లు పేర్కొన్నారు. అంతేగాకుండా నార్త్​ రైల్వే జోన్​ పరిధిలోని 30 ప్రాంతాలపై రైల్​రోకో ప్రభావం పడిందని స్పష్టం చేశారు. 8 రైళ్లను దారి మళ్లించినట్లు చెప్పారు.

Last Updated : Oct 18, 2021, 11:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.